Tuesday, September 29, 2020

AP Emcet exam



Read also:

 కరోనా నేపథ్యంలో క్వారంటైన్‌లో ఉండి ఎంసెట్‌ రాయలేకపోయిన ఏపీ విద్యార్థులకు సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీ ఎంసెట్‌ చైర్మన్, కాకినాడ జేఎన్‌టీయూ ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు. ఇప్పటికే దాదాపు 20 మంది విద్యార్థులు తాము పరీక్ష రాయలేకపోయామని, మరోసారి అవకాశం కల్పించాలని కోరినట్లు చెప్పారు. అలాంటి వారు ఏపీ ఎంసెట్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ మెయిల్‌ ఐడీ 'helpdeskeamcet2020@gmail.com' ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.


అదే విధంగా ఎంసెట్‌ హాల్‌ టికెట్, కోవిడ్‌ పాజిటివ్‌ రిపోర్టులను ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పంపించాలని సూచించారు.

వీరికి ఆన్‌లైన్లో పరీక్ష నిర్వహించే తేదీని ఎంసెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెలియ చేస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వీ.రవీంద్ర తెలిపారు. వివరాలకు 0884-2340535, 2356255 నంబర్ ను సంప్రదించాలని ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజు సూచించారు.ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ పరీక్ష శుక్రవారంతో ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌ లో హైదరాబాద్‌తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లోని 118 కేంద్రాల్లో నిర్వహించారు. ఈనెల 17వ తేదీ నుంచి 25 వరకు ఉదయం, మధ్యాహ్నం మొత్తం 14 సెషన్లలో పరీక్షలు జరిగాయి. 9 సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్‌ విభాగానికి 1,85,946 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,56,899 మంది (84.38 శాతం) పరీక్ష రాశారు. 23వ తేదీ నుంచి 25 వరకు అగ్రి, మెడికల్‌ విభాగం పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 87,652 మంది దరఖాస్తు చేసుకోగా 75,834 (86.52%) మంది హాజరయ్యారు.

అయితే కరోనా బారిన పడి హోం ఐసోలేషన్ ఉన్న, ఆస్పత్రుల్లో ఉన్న విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు. తమకు పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి, అధికారులకు వినతి పత్రాలు అందాయి. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఐసోలేషన్ లో ఉండి ఎంసెట్ రాయలేకపోయిన విద్యార్థులకు మరో సారి పరీక్ష రాసే అవకాశం కల్పించింది. దీంతో ఆయా విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :