Saturday, September 26, 2020

AP EAMCET-2020 Preliminary Key released



Read also:

AP EAMCET-2020 Preliminary Key released-Results will be on Oct 6 or 7th


AP EAMCET-2020 Preliminary Key released-Results will be on Oct 6 or 7th

ఏపీ ఎంసెట్‌ పరీక్షలకు సంబంధించి సమాధానాల ప్రాథమిక కీ విడుదల-ఎంసెట్‌ ఫలితాలను అక్టోబరు 6 లేదా 7న విడుదల.


ఈనెల 28 వరకు అభ్యంతరాల స్వీకరణ-నిన్నటితో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు పూర్తి

రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎంసెట్‌ 2020 పరీక్షలు శుక్రవారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఆన్‌లైన్‌ (సీబీటీ) విధానంలో జరిగిన ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లో 118 కేంద్రాల్లో నిర్వహించారు. ఈనెల 17వ తేదీ నుంచి 25 వరకు ఉదయం, మధ్యాహ్నం మొత్తం 14 సెషన్లలో పరీక్షలు జరిగాయి.

మొత్తం 9 సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్‌ విభాగానికి 1,85,946 మంది దరఖాస్తు చేయగా.. 1,56,899 మంది (84.38 శాతం) పరీక్ష రాశారు. ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు అగ్రి, మెడికల్‌ విభాగం పరీక్షలు జరగ్గా మొత్తం 87,652 మందికి గాను 75,834 (86.52%) మంది హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి సమాధానాల ప్రాథమిక కీ విడుదల చేశారు. ఈనెల 28 వరకు అభ్యంతరాలను దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

Download Response Sheet && Eamcet Key

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :