Thursday, September 24, 2020

Amazon customer support in Telugu



Read also:

Amazon customer support in Telugu


ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.ఇన్‌ ఇకపై తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఇంగ్లీష్, హిందీలో సేవలు అందిస్తోన్న అమెజాన్ పోర్టల్‌.. ఇకపై తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళంలో కూడా రానుంది. కస్టమర్లకు ఆన్‌లైన్‌ షాపింగ్‌లో భాషాపరమైన అడ్డంకులను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. కస్టమర్లు తమకు అనువైన భాషలోనే డీల్స్, డిస్కౌంట్లు, ఉత్పత్తుల సమాచారం, ఖాతాల నిర్వహణ, ఆర్డర్లు, చెల్లింపులు వంటివి జరిపేందుకు ఈ మార్గం సుగమం అవుతుందని అమెజాన్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ కిశోర్‌ తోట తెలిపారు. దీని ద్వారా రానున్న పండుగల సీజన్‌లలో మరో 20-30 కోట్ల మంది వినియోగదార్లకు తమ పోర్టల్‌ దగ్గరవుతుందని వెల్లడించారు.ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ యాప్స్, మొబైల్, డెస్క్‌టాప్‌ సైట్స్‌లో వినియోగదార్లు తమకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చునని.. అంతేకాదు కస్టమర్‌ సర్వీసు సిబ్బందితో తెలుగు, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళంలో మాట్లాడొచ్చని వారు పేర్కొన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :