Tuesday, September 22, 2020

Aadhar update without any documents



Read also:

 We can update the Aadhar card without any documents

ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేయాలంటే డాక్యుమెంట్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్స్ అవసరం లేకుండా కొన్ని వివరాలు అప్‌డేట్ చేయొచ్చు. అవేంటో తెలుసుకోండి.

1. మీరు మీ ఆధార్ కార్డులోని వివరాలను అప్‌డేట్ చేయించాలనుకుంటున్నారా? ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేయాలంటే అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 
2. కొన్ని వివరాలు అప్‌డేట్ చేయడానికి అసలు డాక్యుమెంట్స్ అవసరం లేదు. మీరు నేరుగా ఆధార్ సెంటర్‌కు వెళ్లి ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రూఫ్‌గా ఇవ్వకుండా ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయొచ్చు. ఇటీవల యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI వీటిపై క్లారిటీ ఇచ్చింది.
3. డాక్యుమెంట్స్ లేకుండా ఏ వివరాలను అప్‌డేట్ చేయొచ్చో ట్విట్టర్‌లో తెలిపింది. ఆధార్ కార్డులో ఫోటోగ్రాఫ్, బయోమెట్రిక్స్, జెండర్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ అప్‌డేట్ చేయడానికి మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
4. కేవలం మీ ఆధార్ కార్డు తీసుకొని మీకు దగ్గర్లోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్తే చాలు. మీ వివరాలు అప్‌డేట్ చేయించొచ్చు. మీరు మీ వివరాలు అప్‌డేట్ చేయించాలంటే ఆధార్ సేవా కేంద్రంలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.
5. ఆన్‌లైన్‌లోనే https://appointments.uidai.gov.in/ వెబ్‌సైట్‌లో మీరు కోరుకున్న సమయానికి స్లాట్ బుక్ చేసుకొని వెళ్లి ఆధార్ సేవలు పొందొచ్చు. కొత్తగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ దగ్గర్నుంచి పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ లాంటివన్నీ అప్‌డేట్ చేయొచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :