Tuesday, September 22, 2020

Aadhar card modifications charges list



Read also:

Aadhaar Charges: ఆధార్ సెంటర్‌లో చెల్లించాల్సిన అసలు ఛార్జీలు ఇవే

ఆధార్ సేవల కోసం మీరు ఎక్కువ ఛార్జీలు చెల్లిస్తున్నారా? అసలు ఆధార్ సెంటర్‌లో ఎలాంటి సేవలకు ఎంత ఛార్జీలు చెల్లించాలో అవగాహన ఉందా? ఛార్జీల వివరాలు తెలుసుకోండి

1.మీరు మీ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయించాలనుకుంటున్నారా? అప్‌డేట్ చేయించాలంటే ఛార్జీలు ఎంత చెల్లించాలో తెలియదా? వీటిపై క్లారిటీ ఇచ్చింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. 

2.ఆధార్ వివరాలు ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉండటం అవసరం. ఆధార్ వివరాలు సరిగ్గా లేకపోతే ప్రభుత్వ పథకాలు పొందడంలో ఇబ్బందులు వస్తాయి. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా సమస్యలు తప్పవు. అందుకే ఏ చిన్న మార్పులు ఉన్నా వెంటనే ఆధార్ కార్డులో అప్‌డేట్ చేయించాలి.

3.ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేయడానికి ఆధార్ కేంద్రానికి వెళ్లొచ్చు. కొంతకాలంగా దేశవ్యాప్తంగా యూఐడీఏఐ ఆధార్ సేవా కేంద్రాలను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఆధార్ సేవా కేంద్రాల్లో కూడా ఆధార్ కార్డు వివరాలు అప్‌డేట్ చేయించొచ్చు.

4.ఆధార్ కార్డులో బయోమట్రిక్‌తోపాటు ఒక అప్‌డేట్ ఉన్నా, అంతకన్నా ఎక్కువ వివరాలు అప్‌డేట్ చేయాలన్నా రూ.100 చెల్లించాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది. అంటే... మీరు బయోమట్రిక్‌తోపాటు ఇతర వివరాలు అప్‌డేట్ చేసినా ఛార్జీలు రూ.100 కన్నా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు.

5.కనీసం ఒక మార్పు ఉన్నా ఇవే ఛార్జీలు ఉంటాయని యూఐడీఏఐ తెలిపింది. అయితే కేవలం డెమోగ్రఫిక్ వివరాలు అప్‌డేట్ చేయాలంటే రూ.50 చెల్లిస్తే చాలు. ఇక ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయడానికి సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వివరాలను కూడా వెల్లించింది యూఐడీఏఐ.

6.ఐడెంటిటీ ప్రూఫ్ అప్‌డేట్ చేయాలంటే 32 రకాల డాక్యుమెంట్స్, అడ్రస్ మార్చాలంటే 45 రకాల డాక్యుమెంట్స్, పుట్టిన తేదీ మార్చాలంటే 15 రకాల డాక్యుమెంట్స్‌ని సమర్పించొచ్చు. వీటిలో కనీసం ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇవ్వడం తప్పనిసరి. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా 5 రకాల వివరాలను అప్‌డేట్ చేయొచ్చు.

7.ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేసే వెసులుబాటు ఉంది కదా అని తరచూ అప్‌డేట్ చేస్తూ ఉండటం మంచిది కాదు. ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేసే విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆధార్ కార్డులో పేరును రెండు కన్నా ఎక్కువ సార్లు అప్‌డేట్ చేయలేరు.

8.పుట్టినతేదీ, జెండర్ జీవితంలో ఒకసారి మాత్రమే అప్‌డేట్ చేయడం సాధ్యం. ఆధార్ సేవా కేంద్రంలో ఆధార్ కార్డు వివరాలు అప్‌డేట్ చేయించాలంటే స్లాట్ బుక్ చేయాల్సి ఉంటుంది. https://appointments.uidai.gov.in/ వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి మీకు దగ్గర్లో ఉన్న ఆధార్ సేవా కేంద్రాన్ని సెర్చ్ చేయొచ్చు.

9.ఇదే వెబ్‌సైట్‌లో మీరు కోరుకున్న సమయానికి స్లాట్ బుక్ చేయాలి. ఆ రోజున కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకొని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :