Saturday, May 16, 2020

Wen counseling losses



Read also:


రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ 2015వ సంవత్సరం నవంబర్ నందు జరిగిన వెబ్ కౌన్సెలింగ్ విధానం వలన చాలా నష్టపోయి నారు. వెబ్ కౌన్సెలింగ్ వలన ఈ క్రింది నష్టములు ఉన్నవి.
వెబ్ కౌన్సెలింగ్ వలన నష్టాలు:
1. భార్య భర్తలు ఒకే మండలంలో లేదా ఒకే ప్రదేశంలో పనిచేసే అవకాశం లేదు.
2. మనకు అనుకూలంగా ఉన్న ప్లేస్ ను సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాము. మన ప్రమేయం లేకుండా ప్లేసును నిర్ణయిస్తున్నారు.
3. లాంగ్ స్టాండింగ్ వారు వేల సంఖ్యలలో ఆప్షన్స్ ఇవ్వవలసి యుండుటవలన కన్ ఫ్యూజ్ కు గురి అవుతున్నారు. దాని ఫలితంగా చాలా మందికి 4 కేటగిరి ప్లేసులు, వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు.
4. మన అవసరాలకు అనుగుణంగా తగిన ప్లేసును సెలెక్ట్ చేసుకోలేము.
5. ఆప్షన్స్ ఎంపికలో  కన్ ఫ్యూజన్ ఉంటుంది.
6.రోజుల తరబడి నెట్ సెంటర్ల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని చాలా మంది ఉపాద్యాయులుకి కంప్యూటర్ నాలెడ్జి లేదు.  వారికి చదువు చెప్పటంతోనే సమయం సరిపోతుంది.  ఇక  కంప్యూటర్ నాలెడ్జి ఎక్కడ నుండి వస్తుంది. పోనీ  నెట్ సెంటర్ల మీద ఆధారపడితే ఆప్షన్స్ సరిగా ఇస్తారో లేదో తెలియదు.
7. నెట్ సెంటర్ల చుట్టూ తిరిగే ఓపికలేక ఆప్షన్స్ ఇవ్వటంలో విసుగు చెంది ఆల్ అని సెలెక్ట్ చేసి 4 కేటగిరి ప్లేస్ లకు వెళ్లి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
8. గతంలో జరిగిన వెబ్ కౌన్సెలింగ్ వలన చాలా మంది ప్లేస్ ల విషయంలో నష్టపోయారు. మనకన్నా వెనుక ర్యాంకు వారికి మంచి ప్లేసులు, ముందున్న వారికి అనుకూలంగా లేని ప్లేసులు వచ్చాయని  చెప్పటం జరిగింది.  అదేమని అడిగితే మీరు ఆప్షన్స్  సరిగా ఇవ్వలేదని అంటున్నారు.
9. మనకి అన్యాయం జరిగితే సరిచేసే అవకాశం లేదు, సరిచేసే వారు లేరు.
10. ఏదైనా మందలం ఆల్ అని సెలెక్ట్ చేస్తే 4 కేటగిరి ప్లేసులు రావటం వలన మరి ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయినులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
11. ప్లేసులు ఎలాట్ మెంట్లో నష్టం జరిగితే ఉపాధ్యాయ తల్లి దండ్రులకు సంబంధించిన మెడికల్ ఎమర్జెన్సీ మరియు పిల్లల చదువుల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు.
12. .ఆన్ లైన్ పిర్యాదులు వేదిక సక్రమం గా పనిచేయటం లో విఫలం అయ్యే ప్రమాదం ఉంది
13. వెబ్ కౌన్సెలింగ్ మొదలైన రోజు నుండి ముగిసే వరకూ అన్ని రోజులు ఉపాధ్యాయులు మానసికి ఆందోళనకు గురి అవుతున్నారు. లాంగ్ స్టాండింగ్ వారు ఆప్షన్స్ ఇవ్వాలంటే కనీసం 4 లేదా 5 రోజులు పైనే పడుతుంది. 
సాధారణ కౌన్సిలింగ్ లో బదిలీ తేది నాటి ఖాళీలను ఆప్ట్ చేసుకో వచ్చు.వెబ్ లో రెండో సారి ఆప్షన్ ఫైనల్ చేస్తె ఇక మార్చు కొను అవకాశమే లేదు. స్పౌస్ దగ్గరకు బదిలి కోరుకోవాలన్న నిభందన నిర్వీయం అవుతుంది.
అన్ని ఆలోచించి 3 ఏల్ల తర్వాత జరుగుతున్న బదిలీలు సక్రమం గా జరగాలని కోరుకొను చున్నాము. అదే మామూలు కౌన్సెలింగ్ అయితే కౌన్సెలింగ్ రోజు మాత్రమే  ఆలోచిస్తే సరిపోతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :