Monday, May 18, 2020

Translate Self-Courses in Telugu into Eight Languages



Read also:

Translate Self-Courses in Telugu into Eight Languages


కేంద్ర ప్రభుత్వం స్వయం పోర్టల్‌ ద్వారా ఆంగ్లంలో అందిస్తున్న ఇంజినీరింగ్‌ కోర్సులు ఇక భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. వాటిని తెలుగు సహా మొత్తం ఎనిమిది భాషల్లోకి అనువదించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. దీనిపై అధ్యాపకులు, నిపుణుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇంజినీరింగ్‌, సైన్స్‌, ఫార్మసీ తదితర కోర్సులను ఉచితంగా ఆన్‌లైన్‌లో అందించేందుకు కొద్ది సంవత్సరాల క్రితం స్వయం పోర్టల్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ కోర్సులను దేశంలోని ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐఎస్‌సీ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థలు రూపొందించి స్వయం పోర్టల్‌లో ఉంచుతాయి. వాటిలో చేరి ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రం కూడా అందజేస్తారు. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్‌ ఉన్న కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. అవన్నీ ఆంగ్లంలో ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాలకు చెంది.. ప్రాంతీయ భాషల్లో చదివిన వారికి ఉపయోగపడటం లేదు. ఆంగ్ల భాషపై కనీస నైపుణ్యం లేకపోవడంతో బీటెక్‌ మొదటి సంవత్సరంలో తప్పుతున్న వారి శాతం ఎక్కువగా ఉందని గ్రహించిన ఏఐసీటీఈ.. తాజాగా స్వయం పోర్టల్‌లోని కోర్సులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించాలని నిర్ణయించింది. వీడియోలనూ అనువదిస్తారు. ఇప్పటివరకు 2,867 రకాల కోర్సులను అందిస్తున్నారు. అవన్నీ అండర్‌గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ స్థాయి కోర్సులు. వాటిని అనువదించే వారికి గౌరవ వేతనంతోపాటు ప్రశంసాపత్రాలనూ ఏఐసీటీఈ అందించనుంది.కోర్సులు అనువదించే 8 భారతీయ భాషలు: తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, మరాఠీ.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :