Monday, May 18, 2020

Tips for using AC using and reduce the current bill costs



Read also:

ఏసీ వాడకం లో వేలకు వేలు కరెంట్ బిల్ రాకుండా ఉండాలి అంటే మనం పాటించాల్సిన


ఎయిర్ కండీషనర్ అంటే AC ఈరోజుల్లో అందరి ఇళ్లలోనూ సాధారణంగా ఉండే వస్తువు.
అయితే AC ఎలా వాడాలో తెలుసుకున్న తర్వాతే కొనడం మంచిది.లేకుంటే బిల్లు వాచిపోతుంది.నెలకి వేల రూపాయిలు బిల్లు వచ్చిన ఆశ్చర్య పోవాలిసిన పని లేదు. అందుకే AC బిల్లు తగ్గిచుకొని కూల్ గా ఉండే టిప్స్ ఏంటో చూద్దాం. ఈ టిప్స్ మీరు ఫాలో అయితే మీ కరెంటు బిల్లు చాలా తక్కువ వస్తుంది.
టిప్స్ :
ఫిల్టర్లు:
ఫిల్టర్లు క్లీన్ గా ఉంచుకోవాలి ఇవి వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఫిల్టర్ క్లీన్ గా ఉన్నట్లు ఐతే గాలి వీరివిగా కాయిల్స్ కు సరఫరా ఐతుంది.దాంతో గది త్వరగా చల్ల బడుతుంది.
దింతో కొంత విద్యుత్ ఆదా అవుతుంది.
AC టెంపరేచర్:
AC టెంపరేచర్ 25 డిగ్రీల నుండి 27 డిగ్రీల మధ్య ఉంచుకోవడం విద్యుత్ పొదుపు పరంగా శోచనీయం. దీనివల్ల గది చల్ల పాడడం కరెంటు బిల్లు తగ్గించుకోవడం రెండు సాధ్యం అవుతాయి.
వేసవిలో :
వేసవి లో బయట 41 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నపుడు గదిలో 21 డిగ్రీల కంటే తక్కువగా ఉంచాలి అంటే AC కంప్రెసర్ ఎంత కష్టపడలో ఆలోచించండి. అందుకే ఆ సమయంలో విద్యుత్ వాడకం అధికం అవ్వుతుంది.24 డిగ్రీల పైన సెట్ చేసుకోవడం ద్వారానే విద్యుత్ వినియోగం తగ్గించచ్చు.
గది చల్ల పడేందుకు:
గది చల్ల పడేందుకు ఎన్నో అంశాలు ప్రభావితం చూపిస్తాయి. గది విస్తీర్ణం విండో ఎంత పరిమాణం ఉండాలి,దానికి అద్దాలు ఎలా ఉన్నాయి మరియు గది లో ఉన్న ఫ్లోరింగ్ తూర్పు లేదా పడమర దిక్కులో ఉందా,గదిలో టీవీ ,ఫ్రీజ్ ,కంప్యూటర్ ,తదితర వస్తువులు ఎన్ని ఉన్నాయి,గదిలోకి వేడి ప్రవేశించకుండా తీసుకున్న చర్యలు గదిలో ఎంత మంది ఉన్నారు. ఈ అంశాలు అన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఫ్యాన్ :
సీలింగ్ ఫ్యాన్ అవసరమా గదిలో AC ఉన్నపుడు ఫ్యాన్ వాడడం చాల మంది చేస్తుంటారు.దీని వల్ల AC నుంచి వచ్చే చల్లదనం గది అంత వ్యాపిస్తుంది అని భావిస్తారు. కానీ సీలింగ్ ఫ్యాన్ కారణంగా గదిలో పై కప్పు నుచి వచ్చే వేడి గాలి కిందకి వ్యాపిస్తూ ఉంటుంది.దీని వల్ల మరింత చల్లదనం అవసర పడుతుంది.పైగా ఫ్యాన్ వాడడం వల్ల గది లో ఉన్న దుమ్ము గది అంత వ్యాపిస్తుంది.ఆ దుమ్ము AC ఫిల్టర్లు లోకి చేరుకుంటుంది.కనుక సీలింగ్ ఫ్యాన్ బదులు టేబుల్ ఫ్యాన్ వాడుకోవడం మంచిది.లేకుంటే సీలింగ్ ఫ్యాన్ ను ఒక పాయింట్ లో ఉంచి వాడుకోవాలి.అలాగే AC ఉన్న గదిలో రోజు ఒక గూడా తో క్లీన్ చేసుకోవాలి.
ON/OFF:
తరచూ ON- OFF వద్దు, AC ని తరచు ON/OFF చేయడం వల్ల బిల్లు పెరిగిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల గదిలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల నుంచి 27 డిగ్రీలకి ఉంచుకోవచ్చు దీనివల్ల గది తక్కువ స్థాయి లో గాలి విడుదల అవ్వుతుంటుంది.
ఇలా కాకుండా OFF చేస్తే గదిలో ఉన్న చల్లదనం అంత ఆవిరి ఐపోతుంది.మళ్లీ ON చేస్తే కంప్రెసర్ ఎక్కువ తిరిగి విద్యుత్ ఎక్కువ వాడుతుంది
ఇన్వేటర్ టెక్నాలజీ:
ఈ అవసరం లేకుండా ఇన్వేటర్ టెక్నాలజీ తో కొన్ని AC లు వస్తున్నాయి. ఈ టెక్నాలజీలో గదిలో ఉష్ణోగ్రత చల్లపడిన తర్వాత కూడా ఇన్ వేటర్ ఆగకుండా చిన్నగా తిరుగుతుంటుంది.దీనివల్ల అధిక విద్యుత్ వినియోగం అవసరం ఉండదు.
ఇవి చేస్తే బెటర్:
ఇవి చేస్తే బెటర్ గది తలుపులు తరుచు తెరవదు ఇలా తెరిచిన ప్రతిసారి బయట నుంచి వేడి గాలి లోపాలకి వస్తుంది దంతో గదిలో చల్లదనం కోసం AC ఎక్కువ సేపు పని చేయాలిసి వస్తుంది. విండో AC కంటే స్ప్లిట్ AC సూఛనీయం అందుకు అంటే వేడి గాలి తేలికగా ఉంటుంది దాంతో ఫిల్టర్లు లో ఉంటుంది. స్ప్లిట్ AC గోడ పై పెడతారు గనుక గాలి త్వరగా చల్ల పడుతుంది.
ఇవి గమనించండి:
తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న AC ని ఉంచుకోవాలి మరియు AC కొనే ముందు పవర్ ఇన్ ఫుట్ చూడండి.
సాధారనంగా ఒక టన్ను AC కి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నవి 930 యూనిట్ల నుంచి 980 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగిచుకుంటాయి.అలాగే ట్యూబ్ ఇన్ స్టేల్లాషన్ సరిగా ఉందొ లేదో చూసుకోవాలి.గదిలో మధ్య భాగం లో AC ఏర్పాటు చేసుకోవాలి
కూల్ కోటింగ్:
విండోలు తలుపులు సహా ఏ మార్గం లోను AC లీక్ ఏజ్ కాకుండా చూసుకోవాలి.విండో ఉంది దానికి గలీసులు ఉంటె కర్టెన్ తప్పనిసరిగా ఉంచుకోవాలి.దీనివల్ల గదిలోకి వేడి తక్కువగా ప్రవేశిస్తుంది.గదిలో పై కప్పు కు సీలింగ్ వేసుకోవడం ద్వారా విద్యుత్ అధ అవుతుంది.గదిపైన మరో ఫ్లోర్ లేకపోతే కూల్ సిమ్ కోటింగ్ వేసుకోవడం వల్ల గదిలోకి వేడి ప్రవేశించడం చాలావరకు తెగిపోతుంది. ఈ రకంగా మీరు పాటిస్తే విద్యుత్ బిల్లు తగ్గించుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :