Tuesday, May 19, 2020

Realme Narzo sale



Read also:

Realme Narzo: కాసేపట్లో రియల్‌మీ నార్జో 10 సేల్.ఫీచర్స్ ఇవే


కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రియల్‌మీ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్ వచ్చాయి. రియల్‌మీ నార్జో 10, రియల్‌మీ నార్జో 10ఏ రిలీజ్ అయ్యాయి. వీటిలో రియల్‌మీ నార్జో 10 సేల్ ఇవాళ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
1. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్లు కొనాలనుకుంటున్నారా? రియల్‌మీ నుంచి నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. పర్ఫామెన్స్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారి కోసం ఈ రెండు ఫోన్లను పరిచయం చేసింది రియల్‌మీ. 
2. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా, నైట్‌స్కేప్ మోడ్, పోర్ట్‌రైట్ మోడ్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రియల్‌మీ నార్జో 10 స్మార్ట్‌ఫోన్ సేల్ మే 18న ప్రారంభం అవుతుంది. రియల్‌మీ నార్జో 10ఏ సేల్ మే 22న ప్రారంభమవుతుంది.
3. రియల్‌మీ నార్జో 10 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది.
4. రియల్‌మీ నార్జో 10 మీడియా టెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
5. రియల్‌మీ నార్జో 10 రియర్ కెమెరా 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా కాగా ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్. 
6. రియల్‌మీ నార్జో 10 బ్యాటరీ 5,000ఎంఏహెచ్. రియల్‌మీ యూఐ+ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 
7. రియల్‌మీ నార్జో 10 దట్ వైట్, దట్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.11,999.
8. రియల్‌మీ నార్జో 10ఏ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది.
9. రియల్‌మీ నార్జో 10ఏ మీడియా టెక్ హీలియో జీ70 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
10. రియల్‌మీ నార్జో 10ఏ రియర్ కెమెరా 12 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా కాగా, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. 
11. రియల్‌మీ నార్జో 10ఏ బ్యాటరీ 5,000ఎంఏహెచ్. రియల్‌మీ యూఐ+ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 
12. రియల్‌మీ నార్జో 10ఏ సో బ్లూ, సో వైట్ కలర్స్‌లో లభిస్తుంది. ధర రూ.8,499.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :