Sunday, May 17, 2020

Special passes for ap people



Read also:

ఏపీ ప్రజలకు .స్పెషల్ పాస్‌లు జారీ, దరఖాస్తు వివరాలిలా.

ఏపీ ప్రజల కోసం  సర్కార్ స్పెషల్ పాస్‌లు జారీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యమైన పనులు నిమిత్తం బయటకు వెళ్ళేవారికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీస్ శాఖ పలు సూచనలు చేయగా.. అత్యవసర వైద్య చికిత్స, కుటుంబంలో మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణ తదితర అత్యవసర పనులపై ప్రయాణించాలనుకునే వారికి ఈ-పాస్‌లు జారీ చేయనున్నట్టు పోలీస్ శాఖ తెలిపింది.
➧ఈ-పాస్‌ల కోసం https://citizen.appolice.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం సమర్పించిన వివరాలను పోలీసులు ఆమోదిస్తే దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్, మెయిల్ ఐడీకి వాహన అత్యవసర పాస్‌ను పంపిస్తారు.
➧అత్యవసర పనుల నిమిత్తం అవసరమైన వారు పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది
➧పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని డాక్యుమెంట్లు తప్పనసిరి అని సూచించింది.
➧పాస్ కావాల్సిన వాళ్లు ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి
1) పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
2) ప్రయాణించేవారి వివరాలు
3) ప్రయాణించే వారి ఐడీ ప్రూఫ్స్
4) మెయిల్ ఐడీ
5) అవసరమైన సంబంధిత డాక్యుమెంట్లు
6) మొబైల్ నంబర్
7) వాహనానికి సంబంధించిన వివరాలు
ఈ ప్రొసెస్‌లో వెరిఫికేషన్ సమయంలో మొబైల్ నంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది. అప్లికేషన్ పెట్టె ముందు పైన ఇచ్చిన అన్ని రెడి చేసుకుని ప్రాసెస్ ప్రారంభించాలని పోలీస్‌శాఖ సూచించింది. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత ఓ రిసిప్ట్ వస్తుంది.
అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉండి.. కారణాలు నిజమైతే ఆ తర్వాత మీకు రూటు పాస్ లభిస్తుంది.
Apply Now

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :