Sunday, May 17, 2020

How to develop the android application process in telugu



Read also:

How to develop the android application process in telugu

స్మార్ట్ ఫోన్ల రాకతో.మొబైల్ అప్లికేషన్ల వాడకం జోరందుకుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ప్రపంచ దేశాల్లో విస్తరించి.సరికొత్త మొబైల్ యాప్స్ తయారీకి ప్లాట్‌ఫాంగా నిలిచింది. ప్రస్తుతం కొన్ని కోట్ల మొబైల్ యాప్స్ వాడుకలో ఉన్నాయి. రోజూ కొన్ని వందల యాప్స్ తయారవుతూనే ఉన్నాయి. వాటిని చూడగానే మనకూ ఓ యాప్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. అది ఎలా అన్నది చాలా మందికి తెలియదు. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలిస్తే.ఎవరైనా అప్లికేషన్ తయారు చెయ్యవచ్చు. ఒక్క యాప్ చేసినవాళ్లు.ఎన్ని యాప్‌లైనా చెయ్యగలరు. ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందో, ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్టెప్ -1 : యాప్ ఎలా ఉండాలన్నదానిపై ముందు ఐడియా ఉండాలి. మీరు ఎలాంటి యాప్ తయారు చెయ్యాలనుకుంటున్నారో స్పష్టమైన ఐడియాతో ఉండాలి. ఆ తర్వాత స్టెప్ 2కి వెళ్లాలి.

స్టెప్ -2 : మీ యాప్ ఎలా ఉండాలో స్కెచ్ గీసుకోండి. యాప్‌లో స్టార్టింగ్ పేజ్ ఎలా ఉండాలి. మిగతా పేజీలు ఎలా ఉండాలి. యాప్‌లో టాప్, మిడిల్, డౌన్‌లో ఎక్కడెక్కడ ఎలాంటి ఆప్షన్లు ఉండాలి. మెయిన్ ఆప్షన్లకు అదనంగా ఉండాల్సిన ఆప్షన్లేంటి? ఫొటోలు, వీడియోలు ఎక్కడెక్కడ సెట్ చెయ్యాలి. ఇలా అన్నీ స్కెచ్చులు గీసుకోవాలి. ఎన్ని ఎక్కువ స్కెచ్చులు గీసుకుంటే.యాప్‌పై మీకు అంత ఎక్కువ స్పష్టత వస్తుంది. దాదాపు మీ మైండ్‌లో యాప్ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నా్రో. మీ స్కెచ్చులను చూస్తే.అర్థమవ్వాలి. అలా అవి ఉండాలి.

స్టెప్ -3 : అవసరమై టూల్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు చేసేది ఆండ్రాయిడ్ యాప్ కాబట్టి.మీరు ఆండ్రాయిడ్ స్టూడియో (IDE)ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాగే SDK టూల్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి.

స్టెప్ -4 : ఈ స్టె్ప్‌లో మీరు యాప్‌కి సంబంధించిన బ్యాక్ ఎండ్‌ను సిద్ధం చేసుకోవాలి. అంటే మీ యాప్‌కి సంబంధించిన సర్వర్, స్టోరేజ్ సొల్యూషన్స్‌ని మీకు అవసరమైన విధంగా సెట్ చేసుకోవాలి.

స్టెప్ -5 : యాప్ క్రియేషన్. ఇందులో మీ యాప్‌కి సంబంధించి స్క్రీన్లను డెవలప్ చేసుకోవాలి. యూజర్ ఇంటర్‌ఫేస్ (UI) తయారుచేసుకోవాలి. యూజర్లు మీ యాప్‌తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో, అందుకు సంబంధించిన కాంపోనెంట్స్‌ని యాడ్ చెయ్యండి. వీలైనంత ఈజీగా యాప్ పనిచేసేలా కస్టమైజ్ చెయ్యండి. చివరిగా యాప్ పనిచేసేలా చేసి.దాన్ని బ్యాక్ ఎండ్ సర్వర్‌కు కనెక్ట్ చెయ్యండి. ఇదంతా ఆండ్రాయిడ్ స్టూడియో, SDK టూల్స్ ద్వారా సాధ్యమవుతుంది.

స్టెప్ -6 : టెస్టింగ్, డీ బగ్గింగ్. ఈ దశలో రెడీగా ఉన్న మీ యాప్‌ను టెస్ట్ చెయ్యాల్సి ఉంటుంది. మీ యాప్ బాగా పనిచేస్తే పర్వాలేదు. ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని సరిచేసుకోవాలి. ఒక్కోసారి యాప్ క్రాష్ అవుతుంది. కారణం కనిపెట్టి సరిచెయ్యాలి. ఇది ప్రతి యాప్‌కీ తలెత్తే సమస్యే. ఏ యాప్ కూడా మొదటి దశలోనే సక్సెస్ అవ్వదు. సమస్యలు సరిచేసుకుంటూ పోతే.కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. అన్నీ సెట్ చేసుకుంటూపోవాలి.

స్టెప్ -7 : ఇప్పుడు మీ యాప్ కంప్లీట్‌గా ఎర్రర్స్ లేకుండా ఉన్నట్లు. దాన్ని రిలీజ్ చేసుకోండి. యాప్ రిలీజైతే.అది ఇక లైవ్‌లో ఉన్నట్లు. గూగుల్ యాప్ స్టోర్ ద్వారా డెవలపర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇందుకు గూగుల్ ఆండ్రాయిడ్ ఏడాదికి $25 (రూ.1700) వసూలు చేస్తోంది. అదే యాపిల్ స్టోర్ అయితే సంవత్సరానికి $99 (రూ.7,000) వసూలు చేస్తోంది. మీ యాప్‌కి కమర్షియల్ యాడ్స్ ఇచ్చుకోవడం ద్వారా మనీ సంపాదించుకోవచ్చు.

యూజర్ల అభిప్రాయాలు తెలుసుకుంటూ.ఎప్పటికప్పుడు యాప్‌ని డెవలప్‌ చేస్తూ పోతే.త్వరలోనే అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందగలుగుతుంది. ఇలా ఒక యాప్ క్రియేట్ చెయ్యగలిగే వారు.ఇలాంటి వందల కొద్దీ యాప్స్ సృష్టించగలరు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :