Thursday, May 14, 2020

All trains canceled till june30



Read also:

All trains canceled till june30


కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో భారతీయ రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్-30వరకు ట్రావెల్ చేసేందుకు ప్రయాణికులు బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ నెల 30 వరకు కూడా ఎలాంటి ప్యాసింజర్ రైళ్లు నడవబోవని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇప్పటివరకైతే ఎవరైతే టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకున్నారో, వారందరిని కూడా డబ్బులు మొత్తాన్ని తిరిగి భారతీయ రైల్వే శాఖా చెల్లించనున్నట్లు సమాచారం.
అయితే వలసకార్మికుల తరలింపు కోసం,వివిధ ప్రాంతాల్లో లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వారి కోసం ఉద్దేశించిన శ్రామిక్ రైళ్లు, దేశంలోని 15 ముఖ్య నగరాలకు మే-12నుంచి ప్రారంభమైన స్పెషల్ ట్రైన్స్ మాత్రం యధావిధిగా నడుస్తాయని సృష్టం చేసింది రైల్వే శాఖ
శ్రామిక్ రైళ్లు, స్పెషల్ ట్రైన్స్ మినహా సాధారణ ప్యాసింజర్ రైళ్లు తిరగబోవని రైల్వే శాఖా స్పష్టం చేసింది.
జులై నెల నుండి రైళ్లు యధావిదిగా నడుస్తాయని, అప్పటివరకు ప్రజలందరుకూడా సహకరించాలని కోరారు. కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా మే-25నుంచి విధించబడిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా గూడ్స్ రైళ్లు మినహా ప్యాసింజర్ రైళ్లన్నీ ఎక్కడికక్కడ పట్టాలపై నిలిచిపోయిన విషయం తెలిసిందే.మే 19వ తేదీ నుంచి దేశీయ విమాన సర్వీసులు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :