Tuesday, May 19, 2020

A calendar release of welfare schemes and government programs in AP



Read also:

A calendar release of welfare schemes and government programs in AP


* ఎకానమీని ఎలా పునరుద్ధరించాలి, తిరిగి ఎలా పునరుత్తేజం తీసుకురావాలన్న ఆలోచనతో సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల క్యాలెండర్‌ తయారు చేశామన్న సీఎం జగన్
* కలెక్టర్లు, జేసీలు దీన్ని జాగ్రత్తగా అమలు చేయాలి
* ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో పెట్టిన ఇన్సెంటివ్‌ బకాయిలు రూ.905కోట్లలో సగం మే 22న, మిగిలిన మొత్తం జూన్‌లో సగం ఇస్తాం
* రాష్ట్రంలోని ఎంఎస్‌ఈల్లో దాదాపు 10 లక్షల ఉద్యోగాలను ఎంఎస్‌ఎంఈలు ఇస్తున్నాయి
* ఆ యూనిట్లు.. వారి కాళ్లమీద వారు నిలబడాలి* కరెంటు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు కూడా రద్దు చేస్తూ జీవో ఇచ్చాం
* 3 నెలలపాటు రద్దు అవుతాయి
* మే 26న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్ లకు రూ.5వేలు
* మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం.
గ్రామాల ఆర్థిక వ్యవస్థను ఇవి మారుస్తాయి. దీని కోసం ఒక జేసీని కూడా పెట్టాం. గ్రామాల్లో ఆర్బేకేలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తాయి.
* జూన్‌ 4న వైయస్సార్‌ వాహన మిత్ర పథకం ద్వారా ఆటో, క్యాబ్‌ ఓనర్ కమ్ డ్రైవర్ అయిన వారికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం
* జూన్‌ 10న నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు రూ.10వేలు
* జూన్‌ 17న మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి వైయస్సార్‌ నేతన్న నేస్తం
* ఆప్కోకు సంబంధించిన గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ జూన్ 17న చెల్లింపు
* మాస్క్‌ల తయారీకి ఆప్కో దగ్గర నుంచి బట్ట తీసుకున్నాం. ఆ బట్టకు సంబంధించిన డబ్బు కూడా వెంటనే చెల్లింపు
* జూన్‌ 24న వైయస్సార్‌ కాపు నేస్తం.. 45-60 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి అక్కకూ తోడుంటాం
* జూన్‌ 29న ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి రెండో విడత రూ.450 కోట్లు విడుదల
* జులై 1న 104, 108 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం
* 1060 కొత్త వాహనాలు ప్రారంభం, ఇవన్నీ ప్రజలకు అందుబాటులో వస్తాయి 
* జులై 8న వైఎస్ పుట్టిన రోజు, ఆ రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ, 27 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ* జులై 29న రైతులకు సంబంధించి వడ్డీ లేని రుణాలు
* ఆగస్టు 3న వైయస్సార్‌ విద్యా కానుక. పిల్లలకు యూనిఫారం, పుస్తకాలు, బ్యాగు, బెల్టు, షూ, సాక్సులు* ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం నాడు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పంపిణీ* ఐటీడీఏలున్న కలెక్టర్లు కూడా దీనిపై దృష్టి పెట్టాలి
* ఆగస్టు 12న వైయస్సార్‌ చేయూత
* ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కకు 45-60 ఏళ్ల మధ్య ఉన్నవారు రూ.18,750లు ఆ రోజు పెట్టబోతున్నాం
* ఆగస్టు 19న వైయస్సార్‌ వసతి దీవెన.. ఉన్నత చదువులు చదువుతున్న పిల్లలకు భోజనం, లాడ్జింగ్‌ కోసం
* పిల్లల తల్లులకు రూ.10వేల చొప్పున మొదటి దఫా వసతి దీవెన* ఆగస్టు 26న హౌసింగ్‌ నిర్మాణం
*15 లక్షల వైయస్సార్‌ హౌసింగ్‌ శాంక్షన్, ఇళ్ల నిర్మాణం ప్రారంభం* ఎకనామీని ఇది ఓపెన్‌ చేస్తుంది
* సెప్టెంబర్ 11న వైయస్సార్‌ ఆసరా
* మొదటి దఫా సెప్టెంబర్ 11న వైయస్సార్‌ ఆసరాకు శ్రీకారం
* సెప్టెంబరు 25న వైయస్సార్‌ విద్యా దీవెన ప్రారంభం
* కాలేజీలకు బకాయిలు లేకుండా ఫీజు రియింబర్స్‌ మెంట్‌
* మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఫీజులు నేరుగా పిల్లల తల్లుల చేతికే
* అక్టోబరులో రైతు భరోసాకు సంబంధించి రెండో విడత
* ప్రతి కుటుంబానికి రూ.4వేల చొప్పున* పంట కోసుకునేందుకు లేదా రబీ అవసరాలకు
* తేదీ తర్వాత ప్రకటన
* అదే అక్టోబరు నెలలో హాకర్స్‌కు సంబంధించి ఆర్థిక సాయం
* చిరు వ్యాపారులకు జగనన్న తోడు అనే కార్యక్రమం కింద ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు
* సున్నా వడ్డీకే రూ.10వేల చొప్పున రుణం
* రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి మేలు* నవంబర్‌ లో విద్యా దీవెనకు సంబంధించి రెండో దఫా* పిల్లల ఫీజులు నేరుగా తల్లుల అక్కౌంట్‌కు
* డిసెంబర్‌ లో అగ్రిగోల్డ్‌ బాధితులకు సహాయం
* కలెక్టర్లు, ఎస్సీలు, సీఐడీ విభాగాలు.. కోర్టుల నుంచి అనుమతులు తీసుకోవాలి
* జాబితాలను అప్రూవ్‌ చేయించుకోవాలి
* ఆ సమయానికల్లా... ఈ పనులు పూర్తి కావాలి
* 2021 జనవరిలో రెండో ఏడాది అమ్మ ఒడి కార్యక్రమం
* 2021 జనవరిలో రైతు భరోసా చివరి విడత* సంక్రాంతికి పంటను ఇంటికి తెచ్చుకునే సమయంలో రూ.2వేలు
* 2021 ఫిబ్రవరిలో విద్యా దీవెన మూడో త్రైమాసికానికి సంబంధించి
* అలాగే వసతి దీవెన కూడా రెండో దఫా* 2021 మార్చిలో పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు
* జూన్‌ వరకూ కార్యక్రమాలకు సంబంధించి మార్గదర్శకాలు
* లబ్ధిదారులను గుర్తించడానికి, అలాగే అప్‌డేషన్‌ చేయడానికి ముందుగా క్యాలెండర్‌ చెప్తున్నాం: సీఎం
* ఎవరి పేరైనా అందులో లేకపోతే.. ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి? ఎలా పరిశీలన చేయాలి? తదితర కార్యక్రమాలు జరగాలి
* అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ.. నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు.. అవి కచ్చితంగా అందాలి
* సోషల్‌ ఆడిట్‌ తప్పనిసరిగా జరగాలి
* గ్రామ, వార్డు సచివాలయాలు చూస్తున్న జేసీ ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వరించాలి
* గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏ సేవలు ఏ సమయంలోగా అందుతాయో.. మనం కాల పరిధిని నిర్ణయించాం. ఆ టైమ్‌లైన్స్‌ తప్పనిసరిగా పాటించాలి
* దీని కోసమే ఈ వ్యవహారాలకు ఒక జేసీని పెట్టాం
* ఇది తప్పనిసరిగా అమలయ్యేలా కలెక్టర్లు చూడాలి
* సరైన ప్రోటోకాల్స్‌ పాటించాలి
* పెన్షన్లు, బియ్యం కార్డులు.. ఇవన్నీ కూడా నిరంతరం జరుగుతుంటాయి
* కొత్తగా యాడ్‌ అయ్యేవారు ఉంటారు.. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ
* జూన్‌ 4న వాహన మిత్ర కార్యక్రమం ఎంతో దూరంలో లేదు, వెంటనే దీనికి సంబంధించి పనులన్నీ చేయాలి

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :