Saturday, May 16, 2020

Lockdown 4.0 more Relaxation items



Read also:


లాక్‌డౌన్‌ 4.0లో మరిన్ని సడలింపులు ఇవ్వాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు వీలుగా ఆంక్షల సడలింపు ఉండాలంటున్నాయి. కేంద్రం కొన్ని కఠిన నిబంధనలను సడలించాలని యోచిస్తోందని తెలుస్తోంది. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని కోరుతున్నాయి. మూడో దశ లాక్‌డౌన్‌ ఈ నెల 17తో ముగియనున్న విషయం తెలిసిందే. 
లాక్‌డౌన్‌ 4.0లో అనేక సడలింపులుంటాయి. గ్రీన్‌ జోన్‌లో పూర్తిగా అన్ని కార్యకలాపాలకు అనుమతిస్తారు. ఆరెంజ్‌ జోన్‌లో మాత్రం కొన్ని ఆంక్షలుంటాయి. రెడ్‌జోన్‌ల్లోని కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లో మాత్రం కఠిన ఆంక్షలుంటాయి' అని కేంద్ర హోం శాఖ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు
నిబంధనల సడలింపుల్లో రాష్ట్రాలకు అధికారమివ్వవచ్చన్నారు. లాక్‌డౌన్‌ను కొనసాగించాలని, గ్రీన్, ఆరెంజ్, రెడ్‌ జోన్‌లను నిర్ధారించే అధికారం రాష్ట్రాలకు ఉండాలని తెలంగాణ, పంజాబ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలు కోరుతున్నాయని హోంశాఖలోని మరో అధికారి తెలిపారు. లాక్‌డౌన్‌ 4.0లో జోన్‌లను నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చే అవకాశముందన్నారు. పాఠశాలలు, కాలేజీలు, మాల్స్, సినిమా హాల్స్‌ మూసివేత కొనసాగుతుందన్నారు. 
కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాలను మినహాయించి రెడ్‌ జోన్స్‌లో కూడా క్షౌర శాలలను, ఆప్టికల్‌ షాపులను తెరిచేందుకు అవకాశమివ్వవచ్చని తెలిపారు. వచ్చే వారం నుంచి అవసరాన్ని బట్టి పరిమితంగా రైళ్లను, విమానాలను నడిపేందుకు అనుమతించే ఆలోచన కూడా ఉందన్నారు

Additional information

Zones పై నిర్ణయాధికారం రాష్ట్రాలకే! 
ప్రయాణాలకూ అంచెలంచెలుగా వెసులుబాటు 
లాక్‌డౌన్‌ 8.0 గడువు ఆదివారంతో ముగుస్తున్న నేప థ్యంలో సోమవారం నుంచి ఎలాంటి నిబంధనలు అమల్లోకి వస్తాయన్న ఉత్కంఠ అందరిలో వ్యక్తమవుతోంది.
భవిష్యత్తు కార్యాచరణపై ఈనెల 11న ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ... అన్ని రాష్ట్రాలు బ్లూప్రింట్స్‌ పంపాలని సూచించారు. దానికి గడువు శుక్రవారంతో ముగిసింది. అందిన సూచనలు ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకో నుంది. జోన్లు/ హాట్‌స్పాట్ల నిర్ణయం, ఆంక్షల అమలు ప్వైత్తమిషి రాఫ్రా లకు మరింత నిర్ణయాధికారం కల్పించవచ్చనే సంకేళ న్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఒక (ప్రజల కదలికల్నీ, ఆర్థిక కార్యకలాపాలను అను, నియంత్రించడానికి రాష్ట్రాలకు దానివల్ల వీలుంటుంది. ప... 
మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ 4.0  'అవసరాలకు అనుగుణంగా' రైళ్లను, దేశీయ విమాన సర్వీసులను వచ్చేవారం నుంచి పరిమితంగా పునఃప్రా రంభించేలా నిర్ణయాలు ఉండవచ్చని తెలుస్తోంది. అ ఇప్పటికే పరిమిత సంఖ్యలో రైళ్లు నడుపుతుండటం వల్ల భవిష్యత్తులో భౌతిక దూరం పాటిస్తూ విమాన, బస్సు సర్వీసులు, వ్యక్తిగత వాహనాలు, ఆటోలు, ట్యాక్సీలూ తిరగడానికి అవకాశం కల్పించొచ్చని తెలుస్తోంది. కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాలు లేనిచోట్ల స్థానిక రైళ్ళు మెట్రోలను పరిమిత సామర్థ్యంతో నడిచేలా అనుమతిస్తారని వినిపిస్తోంది. 
పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు మాల్స్‌ను తెరిచేందుకు తదుపరి లాక్‌డౌన్‌లోనూ అనుమతి ఉండదు. కంటెయిన్‌మెంట్‌ జోన్లు మినహా రెడ్‌జోన్లలో క్షౌర శాలలు, సెలూన్స్లు, కళ్లజోళ్ల దుకాణాలు వంటివి తెరిచేందుకు వీలు కల్పించవచ్చని సమాచారం. రెడ్‌జోన్లలోని కంటెయిన్‌ మెంట్‌ ప్రాంతాల్లో మాత్రమే కఠినమైన ఆంక్షలు ఉండవ చృని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. లాక్‌డౌన్‌ పూర్తి ఎత్తివేతను ఎ రాష్ట్రమూ కోరుకోవట్లేదని చెప్పారు. ఆరెంజ్‌, రెడ్‌ జోన్లలో మార్కెట్లను తెరిచే స్వేచ్చను రాష్ట్రా లకు ఇస్తారు. నిత్యావసరేతర వస్తువులను విక్రయించడానికి సరి-బేసి సంఖ్య విధానంలో దుకాణాలకు అనుమతిస్తారు. ఒకటిరెండు రోజుల్లో తుది మార్గదర్శకాలు వెలువరిస్తారు. 
ఎక్కువ ఆర్థిక కార్యకలాపాలు నడవడానికి అవకాశం కల్పిం చాలని కేరళ, కర్ణాటక, గుజరాత్‌, రాజస్ట్రాన్‌, దిల్లీ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశాయి. 18వ తేదీ నుంచి 50% సిబ్బంది కార్యాలయాలకు రావా లని తమిళనాడు ఉత్తర్వులు జారీ చేసింది. కంటెయిన్‌ మెంట్‌ జోన్లలో మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు కొనసాగనివ్వాలని ఆ రాష్ట్రం కోరు తోంది. రెస్టారెంట్లు, వ్యాయమశాలలు, గోల్ఫ్‌కోర్స్‌లు తెరవ డానికి అనుమతించాలని కర్ణాటక అంటోంది. సోమవారం నుంచి కేంద్రం పెద్దఎత్తున సడలింపులు ఇస్తుందని కర్ణాటక సీఎం యెడ్యూరప్ప చెప్పారు. అ కంటెయిన్‌మెంట్‌ జోన్లలో మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తేసి వ్యాపార కార్యకలాపాలకు అనుమతించాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కోరారు. అ మెట్రో, స్టానిక రైళ్లు దేశీయ విమానాలు, హోటళ్లు తెరవడానికి వీలు కల్పించాలని కేరళ అడిగింది. అ సప్టణ ప్రాంతాల్లో అన్నిరకాల వ్యాపార కార్యకలా పాలకు అనుమతించాలన్నది గుజరాత్‌ డిమాండ్‌. అ మహారాష్ట్ర మాత్రం లాక్‌డౌన్‌ మినహాయింపులకు ఏమాత్రం సుముఖంగా లేదు. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :