Wednesday, January 8, 2020

Work books distribution for childrens



Read also:


ప్రతి సబ్జెక్టుకు ఒక్కో వర్క్‌బుక్‌
నెలాఖరుకు 1-6 తరగతుల పుస్తకాల రూపకల్పన పూర్తి
వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యాశాఖ ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ప్రతి సబ్జెక్టుకు అనుబంధంగా వర్క్‌బుక్‌ను తీసుకొస్తోంది. 1-6 తరగతులను పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేయడంతోపాటు సిలబస్‌ను మారుస్తున్నారు. ఈ కొత్త సిలబస్‌లో వర్క్‌బుక్‌లను తీసుకొస్తున్నారు. ఆంగ్లం చదవడం, రాయడం నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పాఠ్యాంశాలతో పోల్చితే 20% పాఠ్యాంశాలు తగ్గనున్నాయి. నిపుణులు, విద్యావేత్తల నుంచి సూచనలు సేకరించిన రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి పాఠాలను కుదించింది. ఈ నెల చివరి నాటికి కొత్త పుస్తకాల రూపకల్పన పూర్తి కానుంది. అనంతరం ముద్రణకు ఇవ్వనున్నారు. పర్యావరణం, రోడ్డు భద్రత, వ్యవసాయంలాంటి పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉపాధ్యాయులకు హ్యాండ్‌బుక్‌ ఇవ్వనున్నారు. ఆంగ్లంలో ఎలా బోధించాలనే దానిపై ఇందులో ఉంటుంది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 5, 6 తరగతుల విద్యార్థులకు ఆంగ్లంపై బ్రిడ్జి కోర్సును నిర్వహించనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సు పుస్తకాలను రూపొందిస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :