Sunday, January 12, 2020

We can deposit and withdraw money in any bank or branch



Read also:


ఇప్పటికే 14 బ్యాంకులు క్యాష్ డిపాజిట్ సదుపాయాల్ని కల్పిస్తున్నాయి. అయితే సుమారు 30,000 ఏటీఎంలల్లో క్యాష్ డిపాజిట్ చేసే సౌకర్యం కల్పించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI భావిస్తోంది. 
డబ్బులు డ్రా చేయడానికి ఎక్కడంటే అక్కడ ఏటీఎంలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ డబ్బులు డిపాజిట్ చేయడానికి క్యాష్ డిపాజిట్ మెషీన్లు కనిపించేది తక్కువే. త్వరలో ఈ సమస్య తీరబోతోంది. బ్యాంకులతో సంబంధం లేకుండా ఏ ఏటీఎంలో అయినా డబ్బులు డిపాజిట్ చేసే సదుపాయం రాబోతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. బ్యాంకు బ్రాంచ్‌లతో పాటు ఏటీఎం కేంద్రాల్లో క్యాష్ డిపాజిట్ చేసే సౌకర్యాలు పెంచాలని బ్యాంకుల్ని కోరింది ఎన్‌పీసీఐ. ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరింది. బ్యాంకింగ్ వ్యవస్థలో కరెన్సీని నిర్వహించే ఖర్చు తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఎన్‌పీసీఐ భావిస్తోంది. అయితే ఇప్పటికే 14 బ్యాంకులు క్యాష్ డిపాజిట్ సదుపాయాల్ని కల్పిస్తున్నాయి. అయితే సుమారు 30,000 ఏటీఎంలల్లో క్యాష్ డిపాజిట్ చేసే సౌకర్యం కల్పించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI భావిస్తోంది. రూ.10,000 లోపు డిపాజిట్లకు రూ.25, అంతకన్నా ఎక్కువ డిపాజిట్లకు రూ.50 ఛార్జీలు వసూలు చేసే ఆలోచనలో ఉంది. ఈ ప్రణాళికలు అమలులోకి వస్తే ఏ ఏటీఎంలో అయినా డబ్బులు డిపాజిట్ చేసే అవకాశం కస్టమర్లకు లభిస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :