Monday, January 13, 2020

This is the story behind the Sankranti festival



Read also:


ప్రపంచంలో 10 వేల రకాల జాతుల పక్షులున్నాయి. వాటిలో భాగమైన కోళ్లలోనే దాదాపు 100 రకాలు ఉన్నాయి. ఇప్పుడంటే ఇన్ని రకాలున్నాయి గానీ... అసలీ కోడి జాతి మొట్టమొదట ఎలా పుట్టిందో పరిశోధకులకు కూడా తెలియదు. ఓ అంచనా ప్రకారం తూర్పు, దక్షిణ ఆసియా దేశాల్లో మొట్ట మొదటిసారిగా కోడి జాతి జన్మించినట్లు చెబుతున్నారు. సాధారణంగా మనుషులతో జీవించేందుకు పక్షులు ఇష్టపడవు. అలాంటిది కోళ్లు మాత్రం మనుషులను చూసి పారిపోతూనే... అదే మనుషులతో మచ్చికగా ఉంటాయి. ఇందుకు కారణం కోళ్లు తినే ఆహారం ఎక్కువగా మనుషుల ఇళ్లలో ఉండటమే అనే వాదన వినిపిస్తోంది. ఎప్పుడో 10 వేల ఏళ్ల కిందటే కోళ్లను ప్రజలు పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఆధారాలు కావాలంటే మాత్రం సింధు నాగరికతా కాలమైన క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో లభిస్తున్నాయి.
హరప్పా, మొహెంజోదారోలో కోడి ఆకారంలోని కొన్ని చిత్రాలు కనిపించాయి. తద్వారా అప్పటి ప్రజలు కోళ్లను పెంచుకున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం ఉన్న కోళ్లను ప్రధానంగా రెండు రకాలుగా విభజించారు. వాటిలో ఒకటి గ్రే జంగల్ ఫౌల్. ఇవి ఇండియాలో ఎక్కువగా కనిపించే కోళ్లు. రెండో రకం రెడ్ జంగల్ ఫౌల్. ఇవి తూర్పు ఆసియాలో కనిపించే కోళ్లు. ఇండియన్ కోళ్ల కంటే తూర్పు ఆసియాలో కోళ్లు పొడవైన రెక్కలు, పెద్ద సైజు తోకతో ఆకట్టుకుంటున్నాయి.
కోళ్ల పందేల్లో ఇప్పుడంటే డబ్బుతో పందేలు కట్టి ఆడుతున్నారు కానీ... పూర్వం... అంటే సింధు నాగరికత కాలంలో కోళ్ల పందేలు వినోదం కోసం మాత్రమే జరిపేవాళ్లు. ఈజిఫ్టులో కూడా కోళ్ల పందేలకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. మనుషులకు ఎలాంటి హానీ లేకుండా... పక్షులు మాత్రమే దెబ్బలాడుకుంటుంటే, ఆ యుద్ధాన్ని చూసి ఆనందపడుతూ అదో వినోదంగా భావించేవాళ్లు అప్పటి పాలకులు.
గ్రీస్‌లో యుద్ధాలకు వెళ్లేముందు శత్రువుల పేర్లను కోళ్లకు పెట్టి పందేలు కాసేవాళ్లు. తద్వారా తమ పుంజు గెలిస్తే, యుద్ధం గెలిచినట్లు భావించేవాళ్లు. సిరియన్లైతే... గెలిచిన కోళ్లకు పూజలు చేసేవాళ్లు. కోడి గెలిస్తే, తాము కూడా విజయం సాధిస్తామన్న బలమైన నమ్మకం వాళ్లది. రోమన్లు.చనిపోయిన కోళ్లను దేవతలకు నైవేద్యంగా ఇచ్చేవాళ్లు. ఇక దాని జోలికి వెళ్లేవాళ్లు కాదు. రాన్రానూ కోళ్ల పందేల అర్థం మారిపోయింది. పరువు, ప్రతిష్టలకు ప్రతిరూపంగా భావిస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :