Friday, January 10, 2020

These are the best phones below 7k



Read also:


కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? మీ బడ్జెట్ రూ.8,000 లోపేనా? రూ.7,500 లోపు మంచి స్మార్ట్‌ఫోన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మరి ఆ ఫోన్స్ ఏవో, ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి.
1. Motorola Moto E6s: మోటోరోలా అతి తక్కువ ధరలో రిలీజ్ చేసిన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ మోటో ఈ6ఎస్. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.1 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండటం విశేషం. మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
2. Motorola Moto E6s: మోటో ఈ6ఎస్ రియర్ కెమెరా 13+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. బ్యాటరీ 3000 ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
3. Motorola Moto E6s: మోటో ఈ6ఎస్ డ్యూయెల్ సిమ్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. పాలిష్డ్ గ్రాఫైట్, రిచ్ క్రాన్‌బెర్రీ కలర్స్‌లో లభిస్తుంది. రిలీజ్ చేసినప్పుడు మోటో ఈ6ఎస్ 4జీబీ+64జీబీ ధర రూ.7,999. కానీ ప్రస్తుతం రూ.6,999 ధరకే కొనొచ్చు.
4. Realme 3: గతేడాది రియల్‌మీ లాంఛ్ చేసిన స్మార్ట్‌ఫోన్లల్లోఒకటి రియల్‌మీ 3. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3డీ గ్రేడియంట్ డిజైన్, డ్యూడ్రాప్ ఫుల్ స్క్రీన్, మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్, ఏఐ బ్యూటిఫికేషన్, కలర్ ఓఎస్ 6, రైడింగ్ మోడ్ లాంటి ప్రత్యేకతలున్నాయి. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.2 అంగుళాలు డిస్‌ప్లే ఉంది
5. Realme 3: రియల్‌మీ 3 మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 13+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్. బ్యాటరీ 4230 ఎంఏహెచ్.
6. Realme 3: రియల్‌మీ 3 ఆండ్రాయిడ్ 9 పై+కలర్ ఓఏస్ 6 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డైనమిక్ బ్లాక్, రేడియంట్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రిలీజ్ చేసినప్పుడు రూ.8,999 కాగా, ప్రస్తుతం రూ.7,499 ధరకే కొనొచ్చు.
7. Asus Zenfone Max M2: ఏసుస్ నుంచి రిలీజ్ అయిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.26 అంగుళాలు డిస్‌ప్లే ఉంది.
8. Asus Zenfone Max M2: ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 13+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. బ్యాటరీ 4000 ఎంఏహెచ్.
9. Asus Zenfone Max M2: ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2 ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.7,499 ధర.
10. Nokia 4.2: నోకియా 4.2 స్మార్ట్‌ఫోన్ కూడా రూ.7,500 లోపు బడ్జెట్‌లో కొనొచ్చు. స్పెసిఫికేషన్స్ చూస్తే 5.7 అంగుళాల హెచ్‌డీ+ 1520x720 పిక్సెల్స్ డిస్‌ప్లే ఉంది.
11. Nokia 4.2: నోకియా 4.2 స్నాప్‌డ్రాగన్ 439 ప్రాససెర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 13+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్.
12. Nokia 4.2: నోకియా 4.2 ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఇందులో 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 3జీబీ+32జీబీ ధర రూ.6,899.
13. Infinix Note 5: ఇన్ఫినిక్స్ నోట్ 5 కూడా బడ్జెట్ స్మార్ట్‌ఫోనే. స్పెసిఫికేషన్స్ చూస్తే 6 అంగుళాలు డిస్‌ప్లే ఉంది.
14. Infinix Note 5: ఇన్ఫినిక్స్ నోట్ 5 మీడియాటెక్ హీలియో పీ23 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 12 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. బ్యాటరీ 4500 ఎంఏహెచ్.
15. Infinix Note 5: ఇన్ఫినిక్స్ నోట్ 5 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.6,999.
16. LG W30: ఎల్‌జీ గతేడాది రిలీజ్ చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఎల్‌జీ డబ్ల్యూ30. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.3 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది.
17. LG W30: ఎల్‌జీ డబ్ల్యూ30 మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 12+13+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్.
18. LG W30: ఎల్‌జీ డబ్ల్యూ30 బ్యాటరీ 4000 ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. థండర్ బ్లూ, ప్లాటినమ్ గ్రే, అరోరా గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. ప్రస్తుత ధర రూ.7,349.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :