Monday, January 13, 2020

Suzuki Access 125 BS6 features



Read also:


సుజుకి మోటార్స్ నుంచీ మరో కూల్ టూవీలర్ మోడల్ రిలీజైంది. దాని ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.
BS6 ఇన్నింగ్స్‌లో తొలిసారిగా యాక్సెస్ 125ని ఇండియాలో లాంచ్ చేసింది సుజుకి. రూ.6500 ప్రీమియంతో వచ్చే ఈ స్కూటర్‌లో ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంది. 
ఈ వెర్షన్‌ను.ఇప్పుడున్న కాలుష్య నియంత్రణ నిబంధనలన్నీ పాటిస్తూ తయారుచేశారు. దీనికి ఉండే 124cc ఎయిర్ కూల్ మోటర్.8.7పీఎస్ పవర్ ఇస్తోంది. 6750rpmతో ఇది వచ్చింది.
ఈ మోడల్‌కి LED హెడ్ ల్యాంప్ ఉంది. ఫ్యూయల్ ఫిల్లర్ బయటివైపు ఉండేలా తయారుచేశారు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్లు. అందువల్ల సీటు కింద స్టోరేజీలో మార్పు లేదు. BS4 స్కూటర్‌కి ఉన్నట్లే... 21.8 లీటర్ల స్పేస్ ఉంది. 
ఈ మోడల్ రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. ఒకటి స్టాండర్డ్, రెండోది స్పెషల్ ఎడిషన్. స్టాండర్ట్ మోడల్‌లో మూడు రకాలున్నాయి. స్పెషల్ ఎడిషన్‌లో రెండు రకాలున్నాయి.
BS4 స్కూటర్‌కి లాగే.ఈ కొత్త మోడల్‌ కూడా ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్క్‌తో, వెనకవైపు సింగిల్ షాక్ అబ్జర్వర్‌తో వెళ్తుంది. ముందు చక్రం 12 ఇంచులు, వెనక చక్రం 10 ఇంచులు ఉండగా.ట్యూబ్ లేని టైర్లను అమర్చారు.
ధర విషయానికి వస్తే.యాక్సెస్ 125 డ్రమ్ (స్టీల్ వీల్స్) రూ.64800 కాగా... యాక్సెస్ 125 డ్రమ్ (కాస్ట్ ఎల్లోయ్ వీల్స్) ధర రూ.66800గా ఉంది. ఇక యాక్సెస్ 125 డిస్క్ (కాస్ట్ ఎల్లోయ్ వీల్స్) రేటు రూ.67800 ఉండగా.యాక్సెస్ 125 డ్రమ్ స్పెషల్ ఎడిషన్ (కాస్ట్ ఎల్లోయ్ వీల్స్) రూ.68500, యాక్సెస్ 125 డిస్క్ స్పెషల్ ఎడిషన్ (కాస్ట్ ఎల్లోయ్ వీల్స్) ధర రూ.69500గా ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :