Sunday, January 5, 2020

SBI benefits



Read also:


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తమ ఖాతాదారులకు అనేక రకాల సేవల్ని ఉచితంగా అందిస్తోంది. వాటి గురించి అవగాహన లేక ఆ సేవల్ని పొందలేకపోతున్నారు కస్టమర్లు. ఎస్‌బీఐ కార్డు ఉన్నవారు బ్యాంకు నుంచి ఉచితంగా బీమా పొందొచ్చు. ఆ వివరాలు తెలుసుకోండి.
1. మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉందా? మీ అకౌంట్‌కు డెబిట్ కార్డ్ తీసుకున్నారా? మీ దగ్గర ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉంటే చాలు. మీకు ఉచితంగా ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. ఎస్‌బీఐ ఇచ్చే కాంప్లిమెంటరీ ఇన్స్యూరెన్స్ ఇది. 
2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులు బేసిక్, ప్రీమియం అని రెండు రకాలుగా ఉంటాయి. ప్రీమియం డెబిట్ కార్డులపై పర్సనల్ యాక్సిడెంటల్, పర్చేస్ ప్రొటెక్షన్, లాస్ట్ కార్డ్ లయబిలిటీ లాంటి ఇన్స్యూరెన్స్ కవర్స్ లభిస్తాయి.
3. ఎస్‌బీఐ గోల్డ్, ఎస్‌బీఐ ప్లాటినం, ఎస్‌బీఐ ప్రైడ్, ఎస్‌బీఐ ప్రీమియం, ఎస్‌బీఐ వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డులపై ఈ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.
4. పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్(డెత్) నాన్-ఎయిర్: డెబిట్ కార్డ్ హోల్డర్‌కు ఈ ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. అది కూడా నాన్-ఎయిర్ యాక్సిడెంటల్ డెత్ మాత్రమే. అంటే విమాన ప్రమాదం కాకుండా ఇతర ఏ ప్రమాదంలో చనిపోయినా ఈ ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది.
5. పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్(డెత్): విమాన ప్రమాదంలో చనిపోతే మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. అయితే అర్హత గల డెబిట్ కార్డు నుంచి మాత్రమే మీరు ఫ్లైట్ టికెట్ కొని ఉండాలి.
6. పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ పొందాలంటే గత 90 రోజుల్లో ఏటీఎం, పీఓఎస్, ఇకామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో కనీసం ఒక్కసారైనా కార్డు ఉపయోగించి ఉండాలి. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్-ఎయిర్, నాన్ ఎయిర్ ఎలా వర్తిస్తుందో ఈ చార్ట్‌లో చూడండి.
7. పర్చేస్ ప్రొటెక్షన్ ఇన్స్యూరెన్స్: మీరు కొన్న వస్తువుల్ని ఎవరైనా కొట్టేసినా, దోపిడీకి గురైనా, ఇంట్లో దొంగలు కాజేసినా, వాహనాల్లోంచి దొంగిలించినా ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. మీరు వస్తువులు కొన్న 90 రోజుల వరకే ఇన్స్యూరెన్స్ ఉంటుంది. మీరు ఆ వస్తువుల్ని అర్హతగల డెబిట్ కార్డుల నుంచి కొనుగోలు చేసి ఉండాలి. పాడైపోయే వస్తువులు, నగలు, విలువైన రాళ్లకు బీమా వర్తించదు. ఏ కార్డుపై ఎంత బీమా వస్తుందో చార్టులో చూడండి.
8. లాస్ట్ కార్డ్ లయబిలిటీ: ఎవరైనా మీ డెబిట్ కార్డు దొంగిలించి అనధికారిక లావాదేవీలు జరిపితే పాలసీ కవర్ అవుతుంది. అయితే మీ కార్డు పోయిన తర్వాత అనధికారిక లావాదేవీకి రెండు రోజుల ముందు నుంచి ఏడు రోజుల తర్వాతి వరకు మీరు ఫిర్యాదు చేస్తేనే బీమా పొందొచ్చు. పిన్ లేదా ఓటీపీ ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్టైతే బీమా వర్తించదు. ఏ కార్డుపై లాస్ట్ కార్డ్ లయబిలిటీ ఎంత వస్తుందో తెలుసుకునేందుకు ఈ చార్ట్ చూడండి.
9. మీరు ఈ బీమా లాభాలు పొందాలంటే ఎస్‌బీఐ డెబిట్ కార్డు తరచూ ఉపయోగిస్తూ ఉండాలి. ఎస్‌బీఐతో లావాదేవీలు జరిపిన వాటికి మాత్రమే బీమా వర్తించేలా నిబంధనలు ఉన్నాయి. మీరు ఇతర కార్డులతో లావాదేవీలు జరిపి ఈ ఇన్స్యూరెన్స్ కవర్ పొందలేరు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :

1 Comments:

Write Comments
January 5, 2020 at 10:29 PM delete

Claim ఏ విధముగా చేయాలో ఎవరిని సంప్రదించాలో కూడా లేదా ఆ website లేదా portal వివరాలు post చేయగలరు

Reply
avatar