Friday, January 10, 2020

SBI Bank offer new scheme for users



Read also:


దేశంలోని 10 పట్టణాల్లో రూ.2.50 కోట్ల లోపు హౌసింగ్ ప్రాజెక్టులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇందులో రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టులు కూడా ఉంటాయి. 
సొంత ఇల్లు మీ కలా లోన్ తీసుకొని సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అదిరిపోయే స్కీమ్ ప్రకటించింది. 'రెసిడెన్షియల్ బిల్డర్ ఫైనాన్స్ విత్ బయ్యర్ గ్యారెంటీ-RBBG' పేరుతో సరికొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద హోమ్ లోన్ తీసుకునే కస్టమర్లకు ఇంటిని అప్పగించే బాధ్యత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదే. అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్‌లో ఇల్లు సెలెక్ట్ చేసుకొని హోమ్ లోన్ తీసుకొని పేమెంట్ చేశారంటే ఆ ప్రాజెక్ట్ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అందించే బాధ్యత బ్యాంకుదే. ఉదాహరణకు మీరు రూ.50 లక్షల విలువైన ఫ్లాట్ లేదా ఇల్లు సెలెక్ట్ చేసుకున్నారు. రూ.25 లక్షలు పేమెంట్ చేశారు. ఒకవేళ మీకు ఇచ్చిన గడువు లోగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రాకపోతే బ్యాంకు మీకు రూ.25 లక్షలు తిరిగి ఇచ్చేస్తుంది.
ఇల్లు కొనాలనుకునే కస్టమర్లలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడటమే కాదు ఇళ్ల అమ్మకాలు వేగవంతం కావడానికీ తోడ్పడుతుంది. హోమ్ లోన్ తీసుకున్న కస్టమర్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చే వరకు బ్యాంకు గ్యారెంటీగా నిలుస్తుంది. ఇల్లు కొనాలనుకునేవారికి, బిల్డర్లకు, బ్యాంకులకు మేలు చేసే స్కీమ్ ఇది.

దేశంలోని 10 పట్టణాల్లో రూ.2.50 కోట్ల లోపు హౌసింగ్ ప్రాజెక్టులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇందులో రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టులు కూడా ఉంటాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో సన్ టెక్ రియాల్టీ ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మూడు ప్రాజెక్టులతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్‌బీఐ సూచించిన ప్రమాణాలు అన్నీ సరిగ్గా పాటించే బిల్డర్లు రూ.50 కోట్ల నుంచి రూ.400 కోట్ల మధ్య లోన్ తీసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :