Friday, January 3, 2020

SBI 2020 Notification 7870 clerk jobs



Read also:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుకు 2020 జనవరి 26 చివరి తేదీ.
బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI భారీగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. వేల సంఖ్యలో పోస్టుల్ని ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 7870 జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో హైదరాబాద్ రీజియన్‌లో 375 పోస్టులున్నాయి. డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. ఇవాళ్టి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు 2020 జనవరి 26 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు https://sbi.co.in/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో మరిన్ని వివరాలు చూడొచ్చు.

SBI Clerk Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలివే

నోటిఫికేషన్ విడుదల- 2020 జనవరి 2
దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 3
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 26
ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్- 2020 ఫిబ్రవరి
ప్రిలిమినరీ ఎగ్జామ్- 2020 ఫిబ్రవరి లేదా మార్చిమెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్- 2020 ఏప్రిల్
మెయిన్ ఎగ్జామ్- 2020 ఏప్రిల్ 19
తుది ఫలితాలు- 2020 జూన్
SBI Clerk Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...
మొత్తం ఖాళీలు- 7870 పోస్టులు (హైదరాబాద్‌లో 375 ఖాళీలు)
విద్యార్హత- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.
వయస్సు- 2020 జనవరి 1 నాటికి 20 నుంచి 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ వికలాంగులకు 15 ఏళ్లు, ఓబీసీ వికలాంగులకు 13 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

SBI Clerk Recruitment 2020: అప్లై చేయండిలా

ముందుగా sbi.co.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
కెరీర్స్ సెక్షన్‌లో junior associates recruitment లింక్ క్లిక్ చేయాలి.
మీ వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
చివరగా ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

ఎస్‌బీఐ క్లర్క్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :