Thursday, January 9, 2020

sankranthi-holidays Prefix Suffix information



Read also:


  • దసరా/సంక్రాంతి సెలవులు 9 రోజులు ప్రకటించినపుడు (ఆదివారంతో కలిపి) చివరి రోజు గానీ , బడి తెరిచే రోజు గానీ (రెండింటిలో ఒకటి మాత్రమే) సాధారణ సెలవు(CL) పెట్టుకోవచ్చు.
  • దసరా/సంక్రాంతి సెలవులు 10 నుంచి 14 రోజులు (ఆదివారంతో కలిపి) ప్రకటించినపుడు చివరి రోజూ, బడి తెరిచేరోజు (రెండు రోజులు) తప్పక బడికి వెళ్ళాలి.
  • అలా వెళ్లకపోతే... మొత్తం సెలవులకి అర్హత గల సెలవు పెట్టవలసి ఉంటుంది.
  • అనగా EL/MCL/HPL/EOL లలో ఏదోఒకటి పెట్టవలసి ఉంటుంది.
  • దసరా/సంక్రాంతి సెలవులు 15 లేక అంతకంటే ఎక్కువ రోజులు (ఆదివారంతో కలిపి) ప్రకటించినపుడు బడి చివరి రోజు గానీ , బడి తెరిచేరోజు గానీ (రెండింటి లో ఒక రోజు మాత్రమే) అర్హత గల సెలవు పెట్టుకోవచ్చు.
  • అర్హత గల సెలవు అనగా EL/HPL/MCL లలో ఒకటి 1 రోజు కోసం వాడుకోవచ్చు.
  • గమనిక :- ఈ సంవత్సరం సంక్రాంతి సెలవులు 10.01.2020 నుంచి 20.01.2020 వరకు అనగా మొత్తం 11 రోజులు. కావున 9వ తేదీ ( చివరి రోజు ) మరియు 21వ తేదీ ( బడి తెరిచే రోజు ) తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలి. ఈ రెండు రోజులలో ఏ ఒక్క రోజు హాజరుకాకపోయినచో ఈ 11 రోజులు అర్హతగల EL/HPL/MCL/EOL లలో ఏదోఒకటి పెట్టవలసి ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :