Thursday, January 2, 2020

Railway new helpline numbers



Read also:

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లను మార్చింది. 2020 జనవరి 1 నుంచి కొత్త హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా భారతీయ రైల్వేకు సాయం కోసం ఫోన్ చేయాలంటే వేర్వేరు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. వాటన్నింటి బదులు కేవలం రెండు హెల్ప్ లైన్ నెంబర్లను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే. రైలు ఎంక్వైరీల కోసం 139, భద్రతకు సంబంధించిన అంశాల కోసం 182 నెంబర్లు మాత్రమే పనిచేస్తాయి. 139, 182 నెంబర్లకు ప్రయాణికులు కాల్ చేయొచ్చు. లేదా ఎస్ఎంఎస్ చేయొచ్చు. ఇక ఇప్పటి వరకు పనిచేస్తున్న జనరల్ కంప్లైంట్ నెంబర్ 138, కేటరింగ్ సర్వీస్ నెంబర్ 1800111321, విజిలెన్స్ నెంబర్ 152210, యాక్సిడెంట్ సేఫ్టీ నెంబర్ 1072, క్లీన్ మై కోచ్ నెంబర్ 58888/138, ఎస్ఎంఎస్ కంప్లైంట్ నెంబర్ 9717630982 పనిచేయవు. ఈ నెంబర్లన్నింటినీ కొత్తగా ప్రారంభించిన నెంబర్లకు అనుసంధానించింది రైల్వే. ఇకపై మీరు భారతీయ రైల్వేను సంప్రదించాలంటే 139, 182 నెంబర్లకు మాత్రమే కాల్ లేదా ఎస్ఎంఎస్ చేయాలి. మీకు ఎలాంటి సేవలు కావాలన్నీ ఇవే నెంబర్లలో సంప్రదించాలి. ఒక్కో సర్వీస్‌కు ఒక్కో ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా, పదేపదే గూగుల్‌లో వెతకాల్సిన పని లేకుండా కేవలం ఈ రెండు నెంబర్లు మాత్రమే గుర్తుంచుకుంటే చాలు. ఈ హెల్ప్ లైన్ నెంబర్లతో పాటు ఇప్పటికే ప్రారంభించిన 'రైల్ మదద్' యాప్ ద్వారా సేవలు పొందొచ్చు. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :