Tuesday, January 14, 2020

PPF new rules



Read also:


కేంద్ర ప్రభుత్వం ఇటీవల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPF అకౌంట్‌ నిబంధనల్ని సవరించిన సంగతి తెలిసిందే. మరి కొత్త నియమనిబంధలు ఖాతాదారులకు మేలు చేస్తాయా? వీటితో లాభమా నష్టమా తెలుసుకోండి.
1. చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPF చాలా పాపులర్ అన్న విషయం తెలిసిందే. దీర్ఘకాలం పెట్టుబడులకు మంచి రిటర్న్స్ ఇచ్చే స్కీమ్ ఇది. పీపీఎఫ్ అకౌంట్‌కు 15 ఏళ్ల మెచ్యూరిటీ ఉంటుంది. ప్రభుత్వం ప్రతీ త్రైమాసికానికి ఓసారి వడ్డీ రేట్లను ప్రకటిస్తుంది.
2. ప్రస్తుతం పీపీఎఫ్ వార్షిక వడ్డీ 7.9%. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పీపీఎఫ్ నిబంధనల్ని మార్చింది. కొత్తగా పలు నిబంధనల్ని ప్రవేశపెట్టింది. మరి ఆ నిబంధనల గురించి మీరూ తెలుసుకోండి. 
3. పీపీఎఫ్‌లో కనీసం రూ.500 పొదుపు చేయాలి. లాక్ ఇన్ పీరియడ్ 15 ఏళ్లు. కొత్త నిబంధనల ప్రకారం పీపీఎఫ్ అకౌంట్ హోల్డర్ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 గుణిజాల మొత్తం చొప్పున ఎన్నిసార్లైనా గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. అంటే రూ.750, రూ.800, రూ.850.ఇలా రూ.50 కలుపుతూ ఎంతమొత్తమైనా డిపాజిట్ చేయొచ్చు. ఎన్నిసార్లైనా చేయొచ్చు.
4. గతంలో అయితే 12 నెలల్లో గరిష్టంగా 12 సార్లు మాత్రమే డిపాజిట్ చేయాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం ఈ పరిమితి లేదు. ఎన్నిసార్లైనా మీరు పీపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేయొచ్చు. గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే జమ చేయాలి.
5. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పరిస్థితుల్లో మాత్రమే పీపీఎఫ్ అకౌంట్‌ను ప్రీమెచ్యూర్ క్లోజర్‌కు అనుమతి ఇస్తుంది ప్రభుత్వం. ప్రస్తుత నిబంధనల ప్రకారం అకౌంట్ హోల్డర్, వారి జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు ప్రాణాంతక రోగాలతో చికిత్స పొందుతుంటే మెచ్యూరిటీకి ముందే అకౌంట్ క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది.
6. ఇందుకోసం సంబంధిత మెడికల్ రిపోర్ట్స్‌ని జత చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు అకౌంట్ హోల్డర్, వారి పిల్లలు ఉన్నత విద్య అభ్యసించేందుకు కూడా ప్రీమెచ్యూర్ క్లోజర్‌కు అనుమతి ఉంటుంది. ఇప్పుడు మరో నిబంధనను జత చేసింది కేంద్ర ప్రభుత్వం. రెసిడెన్సీ స్టేటస్ మారినా ప్రీమెచ్యూర్ క్లోజర్‌కు అనుమతి ఉంటుంది. ఇందుకోసం పాస్‌పోర్ట్, వీజా లేదా ఐటీ రిటర్న్స్ జతచేయాలి. ప్రీమెచ్యూర్ క్లోజర్‌లో 1% వడ్డీ తక్కువగా వస్తుంది.
7. పీపీఎఫ్ అకౌంట్ హోల్డర్ పీపీఎఫ్ అకౌంట్‌ నుంచి లోన్ తీసుకోవచ్చు. అయితే మీకు పీపీఎఫ్ అకౌంట్ ద్వారా వస్తున్న వడ్డీ కన్నా 2% అదనంగా వడ్డీ చెల్లించాలి. అంటే ప్రస్తుతం 7.9% వడ్డీ ఉంది కాబట్టి 9.9% వడ్డీ చెల్లించాలి. ఇది పాత నిబంధనల ప్రకారం. కొత్త నిబంధనలు చూస్తే పీపీఎఫ్ వడ్డీ కన్నా 1% వడ్డీ అదనంగా చెల్లిస్తే చాలు.
8. ప్రస్తుతం 7.9% వడ్డీ ఉంది కాబట్టి 8.9% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అకౌంట్ హోల్డర్ చనిపోతే నామినీ లేదా చట్టపరమైన వారుసులు వడ్డీ చెల్లించాలి. ఒకవేళ వడ్డీ చెల్లించకపోతే అకౌంట్ క్లోజ్ చేసే సమయంలో వడ్డీని మినహాయించుకొని మిగతా డబ్బులు ఇస్తారు.
9. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ చెక్‌ను ఎంతమొత్తంలో అయినా పీపీఎఫ్ అకౌంట్‌లో జమ చేసేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ అనుమతి ఇచ్చింది. గతంలో పరిమితి రూ.25,000 ఉండేది. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి అకౌంట్లకూ ఇదే వర్తిస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :