Friday, January 3, 2020

PM avas yojana scheme



Read also:

ఇన్వెస్ట్ చేసిన నాటి నుంచి 10 ఏళ్ల వరకు పెన్షన్ లభిస్తుంది. 10 ఏళ్లు పూర్తైన తర్వాత పెట్టుబడి మొత్తం తిరిగివస్తుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఈ స్కీమ్ తీసుకోవచ్చు. 

ప్రధాన మంత్రి వయ వందన యోజన... కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించిన పెన్షన్ స్కీమ్ ఇది. ఈ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే నెలకు రూ.1,000, నుంచి రూ.10,000 వరకు పెన్షన్ పొందొచ్చు. పెన్షన్ ఎంత తీసుకోవాలి అనేదానిపై మీ పెట్టుబడి ఆధారపడి ఉంటుంది. మీరు గరిష్టంగా నెలకు రూ.10,000 పెన్షన్ కోరుకుంటే పెట్టుబడి కూడా ఎక్కువే పెట్టాలి. వృద్ధులకు ఆర్థికంగా ఆసరా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'ప్రధాన మంత్రి వయ వందన యోజన' స్కీమ్‌ను లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC మేనేజ్ చేస్తోంది. ఇందులో గరిష్టంగా రూ.15,00,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేసిన నాటి నుంచి 10 ఏళ్ల వరకు పెన్షన్ లభిస్తుంది. 10 ఏళ్లు పూర్తైన తర్వాత పెట్టుబడి మొత్తం తిరిగివస్తుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఈ స్కీమ్ తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవాలంటే ఆధార్ నెంబర్ తప్పనిసరి.
కనీస వయస్సు- 60 ఏళ్లు
గరిష్ట వయస్సు- గరిష్ట పరిమితి లేదు
పాలసీ గడువు- 10 ఏళ్లు
కనీస పెన్షన్- నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.1,2000.
గరిష్ట పెన్షన్- నెలకు రూ.10,000, మూడు నెలలకు రూ.30,000, ఆరు నెలలకు రూ.60,000, ఏడాదికి రూ.1,20,000లోన్ సదుపాయం- పాలసీ మూడేళ్లు పూర్తైన తర్వాత గరిష్టంగా 75% రుణం తీసుకోవచ్చు. వడ్డీ ఏడాదికి 10% చెల్లించాలి.
ఫ్రీ లుక్ పీరియడ్- పాలసీ నచ్చకపోతే తీసుకున్న 15 రోజుల్లో వెనక్కి ఇచ్చేయొచ్చు. ఆన్‌లైన్‌లో తీసుకుంటే 30 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది.
ప్రీమెచ్యూర్ ఎగ్జిట్- 10 ఏళ్ల గడువు పూర్తికాకముందే పాలసీ వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98% మాత్రమే వెనక్కి వస్తుంది.

ఉదాహరణకు 60 ఏళ్ల వయస్సుగల వ్యక్తి 2020 సంవత్సరంలో ఈ స్కీమ్‌లో రూ.15,00,000 పెట్టుబడి పెడితే నెలకు 10,000 చొప్పున ఏడాదికి రూ.1,20,000 పెన్షన్ 10 ఏళ్ల పాటు లభిస్తుంది. 10 ఏళ్లు పూర్తైన తర్వాత పెట్టుబడి పెట్టిన రూ.15,00,000 వెనక్కి వస్తాయి. ఒకవేళ 10 ఏళ్లు పూర్తికాకముందే పెట్టుబడి పెట్టిన వ్యక్తి చనిపోతే రూ.15,00,000 వారి జీవితభాగస్వామి లేదా పిల్లలు లేదా నామినీకి వస్తాయి. ఈ స్కీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :