Thursday, January 2, 2020

nadu nedu crp's and hm instructions



Read also:

సర్కూ్యూలర్‌.నెం. ఎంబిఎన్‌ఎన్‌/19-20/2 తేది: 2-1-2020
విషయము : మనబడి: నాడు- నేడు; సి.ఆర్‌.పిలు మరియు ప్రధానోపాధ్యాయుల పాత్ర గురించి -ఆదేశాలు జారీ.
నిర్దేశములు: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వారి ఉత్తర్వులు నెం. 87, తేది: 30-11-2019.
పైన పేర్కొనబడిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము “మనబడి: నాడు -నేడు" అనే ప్రభుత్వ ప్రాధాన్యత గల కార్యక్రమం మన రాష్ట్రంలో అమలు జరుగుచున్నది. దీనికి సంబంధించి ఒక వినూత్న పద్ధతిలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ద్వారా పనులు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ప్రధాన పాత్ర వహించాల్సి ఉంటుంది. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చురుగ్గా పాల్గొనాలంటే వారిని ప్రేరేపించడం (మొతివతిఒన్‌) మరియు వారిని సౌలభ్యం (ఫచిలితతిఒన్‌) చేయడం అనేవి విద్యాశాఖ నుండి మనం చేపట్టాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలు నిర్వహించుటలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు క్లస్టర్‌ రిసోర్సు పర్సన్లు ముఖ్య బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీరిద్దరూ ఈ క్రింది విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

1.ప్రతి పాఠశాలలోని తల్లిదండ్రుల కమిటి వారానికి ఒకరోజు (అనుకున్న రోజు, అనుకున్న సమయానికి) తప్పకుండా సమావేశం నిర్వహించుకోవాలి. దీనికి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయలు మరియు సీఆర్పీలు తప్పకుండా హాజరు కావాలి.
2.ప్రధానోపాధ్యాయులు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యుందరికీ ఫోన్లు చేసి, వారు ప్రతి వారం తప్పకుండా సమావేశం జరిగేలా బాధ్యత వహించవలెను.
3. ఆ సమావేశంలో తగు విషయాలను / అంశాలను చర్చించి ప్రజాస్వామ్యయుతంగా అందరు కమిటీ సభ్యులు కలిసి నిర్ణయాలు తీసుకునేటట్లు సీఆర్పీ సులభతరం (ఫచిలితతిఒన్‌) చేయాలి.
4.ఆ సమావేశానికి గ్రామ/వార్డు సచివాలయం నుండి ఇంజినీర్‌ సహాయకుడు, సంక్షేమ విద్యా సహాయకులు తప్పకుండా హాజరు అయ్యేటట్లు చూసుకోవాలి.
5.మండలస్థాయిలో మండల విద్యాశాఖాధికారి గారు, పట్టణ ప్రాంతాలలో సంబంధిత డిప్యూటీ ఇన్స్పెక్టర్‌ / మండల విద్యాశాఖాధికారి/ సీఆర్పీలు హాజరు అయ్యేటట్లు పర్యవేక్షించాలి.
6.పాఠశాల తల్లిదండ్రుల కమిటీ వారు ఎలాంటి కాంట్రాక్టరుకు పనులను కట్టపెట్టకుండా ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు చూసుకోవాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :