Tuesday, January 7, 2020

Hugely increased the gold rate



Read also:


బంగారం ధరలు ఆల్‌టైం హై రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న యుద్ధభయాలతో పాటు, రూపాయి విలువ పతనం కావడంతో పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతల కారణంగా బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు చూస్తే ఔన్సు బంగారం ధర ఏకంగా 1580 డాలర్లు తాకింది. సరిగ్గా నెల క్రితం బంగారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర 1450 డాలర్లుగా ఉంది. అంటే అతి స్వల్ప కాల వ్యవధిలో బంగారం ధర 130 డాలర్లు పెరిగింది. అటు దేశీయ మార్కెట్‌లో డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధర పెరుగుదలకు ఎదురు లేకుండా పోయింది. గడిచిన పది రోజుల్లోనే 10 గ్రాముల పసిడిపై రూ.1,410 పెరగగా... ఒకే రోజే రూ.660 పెరగడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 41,380కి చేరింది. అటు 22 క్యారెట్స్ బంగారం రూ.610కి పెరిగి రూ.37,930గా పలకింది.

సోమవారం కూడా బంగారం ధరలు రూ.390 పెరగడంతో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.41,770కి పరుగులు పెట్టింది. 22 క్యారెట్ల పసిడి ధర కూడా రూ.390 పెరగడంతో ఇవాళ 10 గ్రాముల ధర రూ.38,320కి చేరింది. అటు వెండి ధర కూడా పైపైకి వెళ్తోంది. శనివారం రోజు కిలో వెండి ధర రూ.200 పెరగడంతో రూ.49,600కు చేరింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :