Tuesday, January 14, 2020

How to safe our money in paytm wallets



Read also:


మీరు పేటీఎం, ఫోన్‌ పే, గూగుల్ పే, అమెజాన్ పే లాంటి వ్యాలెట్స్ వాడుతున్నారా? వాటిలో డబ్బులు లోడ్ చేసి పేమెంట్స్ చేస్తున్నారా? జేబులో డబ్బులు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా పేమెంట్స్ చేయడం సౌకర్యంగానే ఉంటుంది. కానీ.ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ వ్యాలెట్‌లోని డబ్బులు మాయం అవడం ఖాయం. ఇటీవల ఇలాంటి ఫిషింగ్, మాల్‌వేర్ ఎటాక్, ఇమెయిల్ స్పూఫింగ్ లాంటి మోసాలు జరుగుతున్నాయి. మోసపోతున్నవారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. యాప్‌లో తమ డబ్బు సేఫ్‌గా ఉందని అనుకుంటారు కానీ.ఏదో ఓ చిన్న పొరపాటు వల్ల వ్యాలెట్‌లో క్యాష్ ఖాళీ అవుతోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఎప్పటికప్పుడు ఇమెయిల్స్, మెసేజెస్, ట్వీట్స్ ద్వారా కస్టమర్లను అప్రమత్తం చేస్తూనే ఉంటాయి.
అంతేకాదు... డిజిటల్ వ్యాలెట్ కంపెనీలు కూడా అనేక జాగ్రత్తలు చెబుతుంటాయి. మరి మీరూ ఇలా మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మీ యాప్స్‌ని సేఫ్‌గా ఎలా ఉంచాలో తెలుసుకోండి.
యూపీఐ అకౌంట్.క్షణాల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి, పేమెంట్స్ చేయడానికి ఉపయోగపడే ఫీచర్. ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డులకు పిన్ ఉన్నట్టే యూపీఐ అకౌంట్‌కి కూడా పిన్ ఉంటుంది. మీరు ఎట్టిపరిస్థితుల్లో ఆ పిన్ ఎవరికీ చెప్పొద్దు. మీ ఏటీఎం కార్డు పిన్‌ను ఎలా రహస్యంగా మెయింటైన్ చేస్తారో యూపీఐ పిన్‌ కూడా అలాగే సీక్రెట్‌గా ఉండాలి. అంతేకాదు.మీ యూపీఐ అకౌంట్ ఉన్న యాప్‌లో తప్ప మరే యాప్‌లో మీ యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయొద్దు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.మీరు డబ్బులు పంపడానికి, అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి మాత్రమే మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు డబ్బులు స్వీకరించేందుకు యూపీఐ పిన్ అవసరం ఉండదు. ఎవరైనా మీకు డబ్బులు పంపుతున్నామని, మీ యాప్‌లో వెంటనే యూపీఐ పిన్ ఎంటర్ చేయండి అని అడిగితే అస్సలు పిన్ ఎంటర్ చేయొద్దు. అందులో ఏదో మోసం ఉందనే గుర్తించాలి.
ప్లే స్టోర్‌లో గూగుల్ పే, ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్ పే లాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేసేముందు జాగ్రత్త. వీటిని పోలినట్టు ప్లే స్టోర్‌లో చాలా యాప్స్ ఉంటాయి. పొరపాటున నకిలీ యాప్ డౌన్‌లోడ్ చేస్తే బుక్కైపోతారు. అందుకే యాప్ డౌన్‌లోడ్ చేసేముందు డెవలపర్ పేరు చెక్ చేయాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా యాప్ డౌన్‌లోడ్ చేయొద్దు. మీ పేమెంట్ యాప్‌లో ఏవైనా సమస్యలు ఉంటే.యాప్ ద్వారానే కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి. లేదా అధికారిక వెబ్‌సైట్‌లోనే కస్టమర్ కేర్ నెంబర్లు, ఇమెయిల్ ఐడీలు తీసుకోవాలి. అంతే తప్ప గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్ల కోసం సెర్చ్ చేయకూడదు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :