Thursday, January 9, 2020

How to check your PF balance with mobile number



Read also:


ఉద్యోగికి ప్రావిడెంట్ ఫండ్(PF) గురించి అవగాహన ఉండే ఉంటుంది. మనం పనిచేసే సంస్థ మన నెలవారీ వేతనం నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి దాన్ని ఈపీఎఫ్ ఖాతాలో కలుపుతారు. కొంతమంది తమ ఈపీఎఫ్ ఖాతాలో ఈ పీఎఫ్ మొత్తం సరిగ్గా పడుతుందో లేదో చూసుకోవాలనుకుంటారు. అందుకు మరెన్నో దారులున్నాయి కానీ, అన్నిటికంటే సులువైన దారి ఎస్ఎంఎస్ ద్వారా చెక్ చేసుకోవడమే. మీ మొబైల్ లో ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ మొత్తాన్ని చెక్ చేసుకోవాలంటే కింది ప్రక్రియను అనుసరించండి. కానీ దీనికి ముందుగా మీరు కొన్ని పనులు చేయాలి. ముందుగా ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ లోకి వెళ్లి యూఏఎన్ అకౌంట్ ను యాక్టివేట్ చేసుకోవాలి. అనంతరం మీ స్మార్ట్ ఫోన్ లో ఈ ప్రక్రియను అనుసరించండి.

  • మొదటగా మీ స్మార్ట్ ఫోన్ లో మెసేజింగ్ యాప్ ను ఓపెన్ చేయండి.
  • EPFOHO అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ యూఏఎన్ నంబర్ ను టైప్ చేయాలి.
  • అనంతరం 7738299899 నంబర్ కు దీన్ని పంపించాలి.
  • అంతే మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు మీ ఫోన్ కి ఎస్ఎంఎస్ రూపంలో వచ్చేస్తాయి.

ఒకవేళ మీ యూఏఎన్ నంబర్ యాక్టివేట్ కాకపోతే.. యూపీఎఫ్ఓ వెబ్ సైట్ కు వెళ్లి అక్కడ Activate UAN ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ మీ యూఏఎన్ నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, క్యాప్చా వంటి వివరాలను అందించాలి. తర్వాత కింద ఆథెంటికేషన్ పిన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి యూఏఎన్ ను యాక్టివేట్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయిన 6-7 గంటల్లో యూఏఎన్ యాక్టివేట్ అవుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :