Saturday, January 11, 2020

High power committee proposes key benefits to employees



Read also:


విశాఖకు తరలి వెళ్లే ఉద్యోగులకు వరాలు.హైపవర్ కమిటీ భేటీలో కీలక ప్రతిపాదనలు

రాష్ట్ర రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నం కు తరలించే పరిస్థితులలో ఉద్యోగులకు బకాయి ఉన్న 3 DA లను చెల్లించాలని మరియు 11 వ PRC ని వర్తింపచేయాలని హై పవర్ కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సూచించింది. Note : 13 point in second image
అమరావతి నుంచి విశాఖకు వెళ్లే ఉద్యోగులకు నామమాత్రపు ధరకే 200 గజాల ఇళ్ల స్థలం కేటాయించాలని, ఇంటి నిర్మాణానికి 25 లక్షల రుణ సదుపాయం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇంటి సామాన్ల తరలింపు కోసం... గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగికి లక్ష రూపాయలు, నాన్-గెజిటెడ్ స్థాయి ఉద్యోగికి రూ.75 వేలు, నాలుగో తరగతి ఉద్యోగికి రూ.50 వేలుచెల్లించాలని, ఉచిత వసతి కూడా కల్పించాలని కూడా హైపవర్ కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఉద్యోగి భార్య లేదా భర్త కూడా ఉద్యోగి అయితే.. ఖాళీ ఉందా లేదా అంశంతో సంబంధం లేకుండా భర్త/భార్యను కూడా విశాఖకు బదిలీ చేయాలని, 30 శాతం హెచ్ఆర్ఏను కొనసాగించాలని హైపవర్ కమిటీ భేటీలో నిర్ణయించారు. పది శాతం అదనపు అలవెన్స్ ఇవ్వాలని.. పిల్లల చదువు విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని.. వీఆర్ఎస్ నిబంధనలను సడలించాలని కూడా హైపవర్ కమిటీ భేటీలో చర్చించారు.హైపవర్ కమిటీ ఈ నెల 13న మరోసారి భేటీ కానుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :