Friday, January 3, 2020

gold rate information



Read also:

కొత్త సంవత్సరం రెండో రోజున బంగారం ధరలు న్యూ ఢిల్లీలో స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో తగ్గాయి. హైదరాబాద్‌లో నిన్నటితో పోలిస్తే 24 క్యారట్ బంగారం ధర రూ.30 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.40,720. ఇక 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.37,320. ఇక న్యూ ఢిల్లీలో బంగారం ధరలు చూస్తే 10 గ్రాములపై రూ.38 ధర పెరిగింది. దీంతో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.39,854. న్యూయార్క్‌లో ఔన్స్ వెండి ధర 1,520 డాలర్లు. హైదరాబాద్‌లో వెండి ధరల్లో మార్పు లేదు. కేజీ వెండి ధర రూ.49,350. న్యూ ఢిల్లీలో వెండి ధర స్వల్పంగా పెరిగింది. దేశ రాజధానిలో కిలో వెండి ధర రూ.21 పెరిగి రూ.47,781 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 17.85 డాలర్లు. న్యూ ఢిల్లీలో బంగారం, వెండి ధరలు పెరగడానికి రూపాయి బలహీనపడటమే కారణమని అంచనా వేస్తున్నారు నిపుణులు.

2019 సంవత్సరంలో చూస్తే బంగారంపై పెట్టుబడి పెట్టినవారికి మంచి లాభాలే వచ్చాయి. ఏకంగా 23 శాతం లాభాలను పొందారు ఇన్వెస్టర్లు. 2018 డిసెంబర్ 31న స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.32,270 ఉంటే ఏడాదిలో ధర రూ.39,700 దాటింది. ఏకంగా 10 గ్రాములపై రూ.7,430 లాభం వచ్చింది. వెండిపైనా 22 శాతం లాభాలు వచ్చాయి. కొంతకాలంగా బంగారం ధరలు పెరుగుతున్న ట్రెండ్ చూస్తుంటే.ఆర్థిక మందగమనం కారణంగా గోల్డ్ రేట్ రూ.42,000 నుంచి రూ.45,000 మధ్య రికార్డులు సృష్టించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల విశ్లేషణ.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :