Tuesday, January 14, 2020

Gold price today market rates



Read also:


బంగారం, వెండి కొనాలనుకునేవారికి శుభవార్త. బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. గత వారం రోజులుగా ధరలు తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గితే, మంగళవారం మరో రూ.400 తగ్గింది. అంటే రెండు రోజుల్లో రూ.1,000 తగ్గింది. మంగళవారం హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం ధర రూ.41,060 కాగా, 22 క్యారట్ ధర రూ.37,640. న్యూ ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల బంగారం కేవలం రూ.61 తగ్గి రూ.40,422 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,544 డాలర్లు. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.48,900 ధరకు చేరుకుంది. న్యూ ఢిల్లీలో కేజీ వెండిపై ఏకంగా రూ.602 తగ్గింది. ప్రస్తుతం దేశ రాజధానిలో కేజీ వెండి ధర రూ.47,083. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 17.75 డాలర్లు. అంతర్జాతీయంగా డిమాండ్ లేకపోవడం వల్లే బంగారం వెండి ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :