Wednesday, January 8, 2020

Do you know paytm transaction charges



Read also:


గతంలో కూడా 2 శాతం ఛార్జీలు వసూలు చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ ఛార్జీలను తొలగించింది. ఇప్పుడు మళ్లీ ఛార్జీలను అమలు చేస్తోంది.

మీరు పేటీఎం యాప్ వాడుతున్నారా. పేటీఎంలో డబ్బులు లోడ్ చేసి షాపింగ్ కోసం వాడుతున్నారా? లేదా బిల్లులు పే చేస్తున్నారా? మీ బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. పేటీఎం యాప్ వాడుతున్నవారికి షాక్ ఇచ్చింది కంపెనీ. డబ్బులు లోడ్ చేసే విషయంలో కొత్త రూల్స్‌ని అమలు చేస్తోంది పేటీఎం. ఈ రూల్స్ 2020 జనవరి 1 నుంచే అమలులోకి వచ్చాయి. మీరు క్రెడిట్ కార్డుతో డబ్బులు లోడ్ చేస్తే 2 శాతం ఛార్జీలు చెల్లించాలి. రూ.10,000 కన్నా ఎక్కువ లోడ్ చేసేవారి నుంచి ఈ ఛార్జీలు వసూలు చేస్తోంది పేటీఎం. ఒకవేళ మీరు డెబిట్ కార్డ్ లేదా యూపీఐ ఉపయోగిస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు. క్రెడిట్ కార్డుతో డబ్బులు లోడ్ చేస్తే పేటీఎం ఛార్జీలు వసూలు చేయడం కొత్తేమీ కాదు. 2017 మార్చిలో కూడా ఇలాగే ఛార్జీలను ప్రకటించింది. క్రెడిట్ కార్డు లావాదేవీలపై 2 శాతం ఛార్జీలు వసూలు చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ ఛార్జీలను తొలగించింది. ఇప్పుడు మళ్లీ ఛార్జీలను అమలు చేస్తోంది.

క్రెడిట్ కార్డులతో డబ్బులు లోడ్ చేసేవారి నుంచి పేటీఎం ఛార్జీలు వసూలు చేయడానికి కారణాలున్నాయి. చాలామంది యూజర్లు క్రెడిట్ కార్డుతో వ్యాలెట్‌లో డబ్బులు లోడ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ డబ్బును బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. వాటిని మరో చోట ఇన్వెస్ట్ చేయడమో, వాడుకోవడమో మామూలైపోయింది. ఒకవేళ క్రెడిట్ కార్డుతో నేరుగా ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలంటే ఛార్జీలు చెల్లించాలి. అది కూడా కొంత లిమిట్ వరకే డబ్బులు డ్రా చేసుకోవడం వీలవుతుంది. కానీ పేటీఎం ద్వారా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా డబ్బులు లోడ్ చేసి తమ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఇలా అనేక మంది యూజర్లు కేవలం బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేందుకే క్రెడిట్ కార్డుతో డబ్బులు లోడ్ చేస్తున్నట్టు పేటీఎం గుర్తించింది. అందుకే ఛార్జీలను వసూలు చేస్తోంది.

ఉదాహరణకు మీ పేటీఎం వ్యాలెట్‌లో మీరు రూ.15,000 మీ క్రెడిట్ కార్డ్ నుంచి లోడ్ చేస్తే మీరు 2 శాతం అంటే రూ.300 ఛార్జీలు అదనంగా చెల్లించాలి. అంటే మీ క్రెడిట్ కార్డ్ నుంచి పేటీఎంకు రూ.15,300 పేమెంట్ జరుగుతుంది. అందులో రూ.15,000 మీ వ్యాలెట్‌లో యాడ్ అవుతాయి. రూ.300 పేటీఎంకు వెళ్తాయి. ఇలా ఒక నెలలో రూ.10,000 కన్నా ఎక్కువ లోడ్ చేస్తే ఛార్జీలు తప్పవు. ఒకేసారి రూ.10,000 కాకున్నా వేర్వేరు సందర్భాల్లో రూ.10,000 కన్నా ఎక్కువ లోడ్ చేసినా ఛార్జీలు తప్పవు. ఉదాహరణకు మీరు ఓసారి రూ.3,000, మరోసారి రూ.4,000, మూడోసారి రూ.3,000 లోడ్ చేస్తే రూ.10,000 కోటా పూర్తవుతుంది. అంతకు మించి లోడ్ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సిందే.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :