Monday, January 13, 2020

Do you have your vote in municipal elections Check Like below



Read also:


తెలంగాణలో జనవరి 22న మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా రిలీజైంది. మరి ఆ జాబితాలో మీ ఓటు ఉందా? చెక్ చేయండి ఇలా.
1. తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి కనిపిస్తోంది. జనవరి 22న పోలింగ్ జరుగుతుంది. ఓటరు జాబితా ఇప్పటికే విడుదలైంది. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలనుకునేవారంతా ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 
2. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు చెందిన https://tsec.gov.in/ వెబ్‌సైట్‌లో ఓటర్ స్లిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఓటర్ ఐడీతో ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా మీ వార్డులోని మొత్తం ఓటర్ స్లిప్స్‌ని ఒకేసారి డౌన్‌లోడ్ చేయొచ్చు. ఈ రెండు పద్ధతుల్లో ఓటర్ స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి.
3. నేరుగా ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేయాలంటే ముందుగా https://tsec.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో DOWNLOAD VOTER SLIP లింక్ పైన క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
4. కొత్త పేజీలో మీ జిల్లా పేరును ఎంచుకోండి. EPIC నెంబర్ ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత Search Voter పైన క్లిక్ చేయండి.
5. మీ ఓటర్ స్లిప్ ఓపెన్ అవుతుంది. ఓటర్ స్లిప్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
6. మీ వార్డులోని ఓటర్ల జాబితా డౌన్‌లోడ్ చేయాలంటే ముందుగా https://tsec.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో DOWNLOAD ULB WARD WISE ELECTORAL ROLLS లింక్ పైన క్లిక్ చేయండి.
7. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో జిల్లా పేరు, మునిసిపాలిటీ పేరు వార్డు నెంబర్ ఎంచుకోవాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత GET DATA పైన క్లిక్ చేయాలి.
8. మీ వార్డుకు చెందిన ఓటర్ల జాబితా ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఉంటుంది. మీరు భాష పైన క్లిక్ చేస్తే మీ వార్డులోని ఓటర్లందరి ఓటర్ స్లిప్స్ కనిపిస్తాయి. అందులో మీ కుటుంబానికి చెందిన ఓటరు జాబితా సెలెక్ట్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. 
9. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లేప్పుడు ఓటర్ స్లిప్ తీసుకెళ్లాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :