Friday, January 10, 2020

Do not keep these things in fridge



Read also:


ఇంట్లో ఉండే ఆహార పదార్థాలన్నీ ఫ్రిజ్‌లో పెట్టేయడం మనకు అలవాటు. చల్లగా ఉంటేనే ఫ్రెష్‌గా ఉంటాయన్నది మన ఫీలింగ్. కానీ కొన్నింటిని ఫ్రిజ్‌లో పెడితే ప్రమాదం. అవి చల్లటి ప్రదేశాల్లో ఉండకూడదు. అవేంటో తెలుసుకుందాం.
Tomatoes : చల్లటి ప్రదేశాల్లో టమాటాలు పాడైపోతాయి. మెత్తగా, నీరు పట్టినట్లు ఉబ్బిపోతాయి. ఫ్రిజ్‌లో ఉంచితే... టమాటాల ఫ్లేవర్ కూడా పోతుంది.
Bread : రొట్టె, బ్రెడ్ వంటివి ఫ్రిజ్‌లో పెడితే.వెంటనే పాడైపోతాయి. వాటిని గదిలోనే కాస్త చల్లగా, పొడిగా ఉన్న ప్రదేశాల్లో ఉంచొచ్చు.
Chocolate : చాకొలెట్స్‌ని చాలా మంది కూల్ చేసుకొని తింటారు. నిజానికి వాటిని కూల్ చేసి తింటే... టేస్ట్ ఉండవు. కలర్, టెక్చర్‌ కూడా మారిపోతుంది. చాకొలెట్లు ముఖ్యంగా కోకో బటర్ చాకొలెట్లు.తమ చుట్టూ ఉన్న వాసనల్ని పీల్చుకుంటాయి. అందువల్ల వాటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. బదులుగా వాటిని డ్రై, చల్లటి ప్రదేశంలో ఉంచడం బెటర్.
Cake : కేక్స్‌ని అమ్మే షాపుల వాళ్లు సైతం.వాటిని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అలా కాకుండా.గాలి చేరని కంటైనర్‌లో లేదా.కేక్ టిన్‌లో వాటిని ఉంచడం మంచిది. కేక్ చల్లగా లేకపోతే, మంచి టేస్ట్ ఉంటుంది.
Potatoes : బంగాళాదుంపల్ని ఫ్రిజ్‌లో పెడితే చెడిపోతాయి. వాటిని ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు వాటిలోని పిండిపదార్థం షుగర్‌గా మారుతుంది. అలాంటి వాటిని వండితే, షుగర్ కాస్తా... అమైనో యాసిడ్లతో కలిసి... ఎక్రిలామైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. అది మన నరాలను పాడుచేస్తుంది. కండరాలు బలహీనం అవుతాయి.
Honey : చల్లటి ప్రదేశాల్లో తేనె.. గడ్డకడుతుంది. ఫలితంగా తేనె కాస్తా చక్కెర ముద్దల్లా అయిపోతుంది.
Onions : ఉల్లిపాయల్ని డ్రై ప్రదేశాల్లోనే ఉంచాలి. వాటికి గాలి బాగా తగలాలి. వాటిలో పిండిపదార్థం ఉంటుంది. వాటిని ఫ్రిజ్‌లో పెడితే పాడైపోతాయి. కట్ చేసిన ఉల్లిపాయల్ని కంటైనర్‌లో సీల్ చేసి... అప్పుడు ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు.
Olive oil : ఆయిల్ ఏదైనా సరే ఫ్రిజ్‌లో పెట్టడం సరికాదు. ఇంట్లోనే ఎక్కడ ఉంచినా వాటి కలర్ మారదు. ఆలివ్ ఆయిల్ మాత్రం ఎండ తగిలితే చాలు వెంటనే పాడైపోతుంది. అందువల్ల దాన్ని చల్లటి, చీకటి గదిలో ఉంచాలి. కిచెన్‌లోని కప్ బోర్డ్‌లో ఉంచొచ్చు. ఫ్రిజ్‌లో మాత్రం పెట్టకూడదు.
Coffee : కాఫీకి చుట్టుపక్కల ఉండే వాసనల్ని పీల్చే గుణం ఉంటుంది. అందువల్ల కాఫీని ఫ్రిజ్‌లో పెడితే... దాని సహజ ఫ్లేవర్ పోతుంది. దాన్ని గాలి తగలని కంటైనర్‌లో ఉంచొచ్చు. గదిలోని నీడ, చీకటి ప్రదేశాల్లో ఉంచితేకాఫీ టేస్ట్ పోకుండా ఉంటుంది
Salad dressing : సాస్‌లు, క్రీమ్‌ల వంటివి ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఎందుకంటే... వాటిలో ఆయిల్, వెనిగర్ ఉంటాయి. సలాడ్ డ్రెస్సింగ్‌ను కప్‌బోర్డ్‌లో ఉంచడం మేలు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :