Sunday, January 5, 2020

Diabetics Diet



Read also:


డయాబెటిస్ ఉన్నవారు కంటిన్యూగా తాము తినే ఆహారంపై దృష్టి పెడుతూనే ఉండాలి. వారికి ఎక్కువ ప్రయోజనం కలిగించే ఆహారాన్ని తెలుసుకుందాం
Diabetics Diet : ఒక్కోసారి కొంత మందికి సడెన్‌గా కళ్లు తిరుగుతాయి. నీరసం వచ్చేస్తుంది. చెమట పట్టేస్తుంది. దాహం వేస్తుంది. ఇలాంటి రకరకాల లక్షణాలు ఉంటుండటంతో ఎందుకైనా మంచిదని డాక్టర్‌ను కలుస్తారు. పరీక్షించిన డాక్టర్ మీకు షుగర్ వ్యాధి వచ్చింది. డోంట్ వర్రీ నేను చెప్పిన జాగ్రత్తలు పాటించండి అని చెబుతుంటారు. టైమ్ ప్రకారం తినడం ఏవి తినాలో అవి మాత్రమే తింటే డయాబెటిస్‌ను చక్కగా కంట్రోల్ చెయ్యగలం. నిజానికి డయాబెటిస్ వచ్చినంత మాత్రాన ఆవేదన, ఆందోళన చెందాల్సిన పని లేదు. తినే ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తే డయాబెటిస్ అస్సలు బాధించదని డాక్టర్లు చెబుతున్నారు. అలాంటి మూడు ఆహారాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Spinach (పాలకూర) : ఇందులో కావాల్సినంత ఫైబర్ ఉంటుంది. ఇది ఆహారాన్ని వెంటనే జీర్ణం కానివ్వదు. అందువల్ల ఆహారంలోని షుగర్ (గ్లూకోజ్) మొత్తం వెంటనే రక్తంలో కలవదు. నెమ్మది నెమ్మదిగా కొద్దికొద్దిగా కలుస్తుంది. అందువల్ల బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. ఒక్కసారిగా పెరిగితే ప్రమాదం. పాలకూర అలా జరగనివ్వదు కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు దాన్ని తినడం మేలు. పాలకూరలో పిండి పదార్థం ఉండదు. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువే. అందువల్ల పాలకూర ఎట్టి పరిస్థితుల్లో గ్లూకోజ్ లెవెల్స్‌ని పెరగనివ్వదు. అందుకే దీన్ని తినమంటున్నారు డాక్టర్లు.
Tomatoes (టమాట) : టమాటాల్లో కేలరీలు తక్కువ. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఇవి సరైన ఫుడ్. టమాటాల్ని సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. వీటిలో C విటమిన్ ఉంటుంది. ఇవి మన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. టమాటాల్లో ఉండే విటమిన్ A. కంటి చూపును మెరుగుపరుస్తుంది. జనరల్‌గా డయాబెటిస్ ఉన్నవారికి కంటి చూపు సమస్యలుంటాయి. టమాటాల్లోని లైకోపీన్ గుండె సంబంధిత సమస్యలతో పోరాడుతుంది. ప్రొస్టేట్ కాన్సర్‌తో పోరాడే శక్తి కూడా టమాటాలకు ఉంది.
Broccoli (బ్రకోలి) : ఇందులో కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్థాలు) తక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ A, C, K ఉంటాయి. అందువల్ల బ్రకోలీ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో కూడా ఫైబర్ ఉంటుంది. అందువల్ల తిన్న ఆహారం వెంటనే జీర్ణం కాదు. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవు. బ్రకోలీలో గుండె సమస్యలు రాకుండే చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బాడీలో వేడిని కూడా ఇది తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య ఉండేవారు బ్రకోలీ తింటే ప్రయోజనం కలుగుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :