Friday, January 10, 2020

Chandragrahanam



Read also:


ఈ ఏడాది మొత్తం ఆరు గ్రహణాలు
రాత్రి 10:37 గంటలకు ప్రారంభం కానున్న చంద్రగ్రహణం
భారత్‌లో పాక్షికమే
మొన్ననే మనమంతా సూర్యగ్రహణంపై మాట్లాడుకున్నాం. ఇప్పుడు చంద్రగ్రహణం.అదికూడా తోడేలు చంద్రగ్రహణం (Wolf Lunar Eclipse). దాని ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.
జనవరి 10 (ఇవాళే) అర్థరాత్రి దాటాక.అంటే అర్థరాత్రి 12.30కి తోడేలు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. నేటి రాత్రి 10.37కి చంద్రగ్రహణం మొదలై... 12.30కి పూర్తిస్థాయికి చేరి.జనవరి 11 తెల్లవారు జాము 2.42కి చంద్రగ్రహణం ముగుస్తుంది. గ్రహణ సమయంలో... చందమామకూ, సూర్యుడికీ మధ్య భూమి వస్తుంది. భూమి అడ్డుగా రావడం వల్ల.సూర్యుడి కాంతి చందమామపై పడదు. అందువల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్దగా కనిపించదు. కానీ.దేశవ్యాప్తంగా చంద్రగ్రహణాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. ఇండియాతోపాటూ. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.సూర్యగ్రహణాన్ని చూడాలంటే... ప్రత్యేక గ్లాసెస్ అవసరం. డైరెక్టుగా చూడలేం. అదే చంద్రగ్రహణమైతే తనివితీరా చూడొచ్చు. అందుకే సంపూర్ణంగా ఉన్న చంద్రుణ్ని ఇవాళ మనం గ్రహణం వచ్చినట్లుగా చూడగలం. ఇవాళ వచ్చే చంద్రగ్రహణం పాక్షికమైనది. అందువల్ల చందమామ పూర్తిగా కనుమరుగు అవ్వదు. చాలా ప్రాంతాల్లో ఇది కనపడదు కూడా. మన తెలుగు రాష్ట్రాల్లో కనిపించే అవకాశాలు తక్కువే. కోల్‌కతాలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని ఖగోళ వేత్తలు తెలిపారు. 2020లో మొదటి గ్రహణం ఇదే. నెక్ట్స్ జూన్ 5, జులై 5, నవంబర్ 30న కూడా చంద్ర గ్రహణాలు ఉన్నాయి.
ఈ దశాబ్దంలో తొలి గ్రహణానికి ఈ రాత్రే ముహూర్తం. ఈ ఏడాది మొత్తం ఆరు గ్రహణాలు.నాలుగు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు కనువిందు చేయనుండగా, నేటి రాత్రి తొలి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఆసియా, ఆఫ్రికా, యూరప్‌ దేశాలతోపాటు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపించనుంది.
నేటి రాత్రి 10:37:44కు గ్రహణం ప్రారంభమై శనివారం తెల్లవారుజామున 2:42:19కు ముగియనుంది. అంటే దాదాపు నాలుగు గంటలపాటు గ్రహణం కొనసాగుతుంది. అయితే, భారత్‌లో ఇది పాక్షికమేనని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
జూన్ 5, 6వ తేదీల్లో ఏర్పడే మరో చంద్రగ్రహణం మాత్రం భారత్‌లో స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది సంభవించనున్న ఆరు గ్రహణాల్లో మూడు మాత్రమే భారత్‌లో కనిపించనున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :