Friday, January 10, 2020

Budget Sessions of Parliament from 31st January



Read also:


బడ్జెట్ సమావేశాల్లో తొలి విడతను జనవరి 31 నుంచీ ఫిబ్రవరి 11 వరకూ,రెండో విడతను మార్చి 2 నుంచీ ఏప్రిల్ 3 వరకూ నిర్వహించబోతున్నారు.
దేశ ఆర్థిక పరిస్థితి రాన్రానూ దిగజారుతున్న సమయంలో.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్ని రెండు దశల్లో నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఒప్పుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.రెండు సభలనూ ఒప్పించారు. ఆ ప్రకారం.బడ్జెట్ సమావేశాల్లో తొలి విడతను జనవరి 31 నుంచీ ఫిబ్రవరి 11 వరకూ.రెండో విడతను మార్చి 2 నుంచీ ఏప్రిల్ 3 వరకూ నిర్వహించబోతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్.తన రెండో సాధారణ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఐతే.ఈసారి కూడా బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా సాగే అవకాశాలు ఏమాత్రం కనిపించట్లేదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పౌరసత్వ చట్టం నిరసనలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నాయి. దానికి తోడు దేశ ఆర్థిక పరిస్థితి కూడా బాలేదు. GDP వృద్ధి రేటు పడిపోతోంది. ధరలు పెరుగుతున్నాయి. ఆటోమొబైల్ సెక్టార్ మూలనపడింది. సంక్షేమ అంచనాలు అదుపు తప్పాయి. అందువల్ల ప్రభుత్వాన్ని ఎలాగైనా ప్రశ్నిస్తామని ప్రతిపక్షాలు పట్టుదలగా ఉన్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :