Friday, January 10, 2020

Benifits with banana



Read also:


ఫ్రూట్స్ లలో దేని ప్రత్యేక దానిదే అలాగే అరటిపండు కూడా, అరటిపండు అంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు. రోజు అరటిపండు తినటం వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం .
అరటిపండు సూక్రోజ్, ఫ్రక్టోజ్ మరియు గ్లూకోస్ వంటి సహాయ చక్కెరలతో పాటూ, ఫైబర్ లను కూడా కలిగి ఉంటుంది. అరటిపండు తక్షణ శక్తిని అందించటమే కాకుండా, శక్తి స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. ఒక అరటిపండు నుండి వచ్చే శక్తి ద్వారా నిరంతరంగా 90 నిమిషాల పాటూ కఠినమైన వ్యాయామాలను చేయవచ్చని పరిశోధనలలో వెల్లడించారు. ఇవే కాదు అరటి పండు తినటం వలన కలిగే మరిన్ని లాభాల గురించి తెలుసుకుందాం.

రక్తపోటు

ఏకైక ఉష్ణమండల పండుగా పేర్కొనబడే అరటిపండు (బనానా) అధికంగా పొటాషియం, ఉప్పును తక్కువగా కలిగి ఉండి, రక్తపోటుకు సరైన ఔషదంగా పేర్కొనవచ్చు. స్ట్రోక్ మరియు రక్తపోటును ఆరోగ్యకర నిర్వహిస్తుందన్న కారణం చేత అరటిపండు పరిశ్రమలు కొనసాగించాలని "యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్" వారు అధికారిక వాదనలను చేయటానికి సిద్దమయ్యారు.

మెదడు యొక్క శక్తి

ట్వికెన్హమ్ (మిడిల్సెక్స్) స్కూల్లో 200 మంది విద్యార్ధులకు పరీక్ష సమయంలో వారి మెదడు యొక్క శక్తి మరియు సామర్థ్యాన్ని పెంచుటకు గానూ సంవత్సరం పొడవునా ఉదయాన అల్పాహారంగా మరియు మద్యన్న భోజనం తరువాత అరటిపండును ఇచ్చారు. పొటాషియంను అధికంగా కలిగి ఉండే ఈ పండు నేర్చుకోవటంపై ఆసక్తిని పెంచుతుందని పరిశోధనలలో వెల్లడించబడింది.

మలబద్దకం

ఫైబర్ ను అధికంగా కలిగి ఉండే అరటిపండును రోజు పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోవటం వలన జీర్ణవ్యవస్థలోని పేగు కదలికలు సరిగా జరపబడి, మలబద్దకానికి దూరంగా ఉంచుతుందని అధ్యయనాలలో పేర్కొనబడింది. కావున మలబద్దకం సమస్యను కలిగి ఉండే వారు రోజు ఒక అరటిపండు తప్పక తినాలి.

హ్యాంగ్ఓవర్

హ్యాంగ్ఓవర్ సమస్య నుండి త్వరగా ఉపశమనం పొందాలంటే అందుబాటులో ఉన్న మంచి మార్గం- తేనె కలిపిన బనానా మిల్క్ షేక్. అరటిపండు జీర్ణాశయాన్ని శాంతి పరుస్తుంది, తేనె క్షీణించిన చక్కెర స్థాయిలను తిరిగి నిర్మిస్తుంది మరియు పాలు శరీర వ్యవస్థలను తిరిగి హైడ్రేట్ అయ్యేలా చేస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :