Saturday, January 4, 2020

Beatroot juice benefits



Read also:

Fitness : చాలా మంది జిమ్‌కి వెళ్లేవారికి అతి పెద్ద సమస్య ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని. ముఖ్యంగా వర్కవుట్ తర్వాత ఏ డ్రింక్ తాగితే మేలు జరుగుతుంది అన్న అంశం వాళ్లను వేధిస్తూ ఉంటుంది. ఎందుకంటే. ఏది బడితే అది తాగనివ్వరు జిమ్ ట్రైనర్లు. వర్కవుట్ తర్వాత ఎనర్జీ లెవెల్స్ బాగా పడిపోతాయి. మళ్లీ ఫిట్‌ అయ్యేందుకు మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. తద్వారా కండరాలు మళ్లీ బలం పుంజుకొని. రికవరీ అవుతాయి. ఇందుకోసం రకరకాల ఆహారాలున్నాయి. వాటిలో ఒక్క బీట్ రూట్ జ్యూస్ మాత్రం ప్రత్యేకమైనది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వర్కవుట్ తర్వాత అది తాగితేనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు. ఎందుకో తెలుసుకుందాం.
Why beetroot juice: సూపర్ ఫుడ్‌లలాగే. బీట్ రూట్ జ్యూస్‌ని సూపర్ జ్యూస్ అంటున్నారు. అథ్లెట్ల పెర్ఫార్మెన్స్‌ని పెంచడంలో, బీపీని రెగ్యులేట్ చెయ్యడంలో, రక్త ప్రసరణను పెంచడంలో ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్, మెగ్నీషియం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్ గుణాలుంటాయి. అందువల్ల ఇది వర్కవుట్ తర్వాత తాగేందుకు సరైన డ్రింక్‌గా గుర్తింపు పొందింది.
The study : ఇంగ్లండ్‌లోని నార్తంబ్రియా యూనివర్శిటీ ఓ పరిశోధన చేసింది. ఏ ఇతర ఆహారాల కంటే కూడా. బీట్ రూట్ జ్యూస్ తాగితే. కండరాల రికవరీ వేగంగా అవుతుందని ఈ పరిశోధనలో తేలింది. మొత్తం 20 మందిపై దీన్ని జరిపారు. వాళ్లను మూడు గ్రుపులుగా చేశారు. ఓ గ్రూపు 250ml బీట్ రూట్ జ్యూస్ తాగింది. మరో గ్రూపు 125ml తీసుకోగా. మూడో గ్రూపుకి ప్లాసెబో ఇచ్చారు. ఎక్కువ డోస్ బీట్ రూట్ తీసుకున్న గ్రూప్ త్వరగా రికవరీ అయ్యింది. ఎందుకంటే ఇందులో వేడిని తగ్గించే గుణాలుంటాయి. అలాగే. కండరాలు త్వరగా రికవరీ అయ్యేలా చేసే. నైట్రిక్ యాసిడ్ ఉంది.
ఎప్పుడైనా తాగొచ్చా : పైన వర్కవుట్ తర్వాత అనుకున్నా. నిజానికి ఈ జ్యూస్‌ని వర్కవుట్ ముందు, వర్కవుట్ చేస్తున్నప్పుడు మధ్యలో, వర్కవుట్ తర్వాత ఎప్పుడైనా తాగొచ్చు. తియ్యగా ఉండే ఈ జ్యూస్. వెంటనే పెర్ఫార్మెన్స్ పెరిగేలా చేస్తుంది. అందుకే మారథాన్ రన్నింగ్‌లో అథ్లెట్లకు దీన్ని ఇస్తుంటారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :