Sunday, January 5, 2020

AP Government given Clarity on new ration cards and pensions



Read also:


సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటూ మిగిలిన పథకాలకు ఒక్కొక్కటిగా శ్రీకారం చుడుతున్నారు. ఉగాది నాటికి పేదలకు ఇళ్లు ఇచ్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తాజాగా కొత్త రేషన్ కార్డులు, పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి1 నుంచి కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డులు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. అర్హుల జాబితాను సిద్ధం చేసి సంక్రాంతి నాటికి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని అధికారులను సూచించారు.ఇటు పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఇంకా 15 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందని.. కలెక్టర్లు దీనిపై ఫోకస్ పెట్టాలని సూచించారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. అలాగే ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం అందడంలో జాప్యం జరుగుతోందని.

అధికారులు త్వరగా రైతులకు పరిహారం అందించాలని ఆదేశించారు. కలెక్టర్ దగ్గర రూ.కోటి చొప్పున ప్రత్యేక నిధి ఉంచినా ఎందుకలా చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం అమలుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి రోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన కొనసాగుతుందని.. దిశ చట్టం అమలుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని.. జనవరి నెలను దిశ మాసంగా భావించి పని చేయాలని సూచించారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, రాష్ట్రానికి 2020 చరిత్రాత్మక సంవత్సరం కావాలన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :