Saturday, January 4, 2020

AP-Captial-Items in the Boston Committee Report



Read also:

3 రాజధానులకే మొగ్గు-బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక ముఖ్యాంశాలు

GN రావు కమిటీ చెప్పిన విషయాలు అందరికీ తేలిగ్గా అర్థమయ్యాయి. కానీ బోస్టన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మాత్రం కాస్త గందరగోళం కలిగించింది. అందులో ముఖ్యాంశాలు తెలుసుకుందాం.
ఏపీలో మూడు రాజధానులే ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీఎన్ రావు కమిటీతో పాటు బోస్టన్ కమిటీ కూడా బహుళ రాజధానులకే మొగ్గుచూపింది. అమరావతిలో సీఎం జగన్‌కు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీ సమర్పించింది. ఆ నివేదికలో ఏపీ అభివృద్ధి, రాజధానిపై ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దేశంలో బహుళ రాజధానులున్న రాష్ట్రాలపై అధ్యయనం చేసిన బీసీజీ కమిటీ.. ఆయా రాష్ట్రాల అభివృద్ధిని నివేదికలో వివరించారు. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణను సైతం నివేదికలో ప్రస్తావించారు. అంతేకాదు అమరావతి ప్రాంత అభివృద్ధి వ్యూహాన్ని నివేదికలో సూచించింది బీసీజీ. ఏయే రంగాల్లో పెట్టబడులు పెట్టాలి.. వికేంద్రీకరణకు ప్రభుత్వం ఏం చేయాలన్న వివరాలను వివరించారు. అభివృద్ధి సూచికల వారీగా జిల్లాల పరిస్థితి వివరించారు. వ్యవసాయ, పర్యాటక, పరిశ్రమ, మత్స్య రంగాల అభివృద్ధిని నివేదిలో పేర్కొన్నారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదికలపై త్వరలో ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేసి.. ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనుంది. అనంతరం జనవరి 20 తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి మూడు రాజధానుల అంశంపై ప్రకటన చేసే అవకాశముంది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అందరూ చర్చించుకుంటున్నది రాజధాని అంశానికి సంబంధించి ప్రభుత్వానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) ఇచ్చిన నివేదిక గురించే. ఈ నివేదిక పైపైన చెప్పినట్లుగా కాకుండా. చాలా లోతుగా అధ్యయనం చేసినట్లుగా చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. ఓవరాల్‌గా మాత్రం. ఈ నివేదిక కూడా. దాదాపు GN రావు కమిటీ ఇచ్చిన నివేదికలాగానే ఉంది. వైజాగ్‌లోనే పరిపాలక రాజధాని ఉండాలన్నట్లుగా నివేదిక సారాంశం ఉంది. అలా ఉంటూనే. ఇంకా చాలా అంశాల్ని ఈ నివేదికలో టచ్ చేశారు. రాష్ట్రాన్ని ఆరు ప్రాంతాలుగా విడగొట్టడం, పరిశ్రమలు, టూరిజం, వ్యవసాయం ఇలా అన్ని అంశాల్నీ లెక్కలోకి తీసుకున్నట్లు రూపకర్తలు చెబుతున్నారు. ఐతే. ఈ నివేదికలో కీలక అంశాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యాంశాలు

  • ప్రతీ జిల్లాలోనూ సామాజిక, ఆర్ధిక పరిస్ధితులను పరిశీలించిన బోస్టన్ గ్రూప్
  • ఏపీలో వ్యవసాయం, ఫిషరీస్, పారిశ్రామిక వృద్ధి, నీటిపారుదల, రవాణాను పరిశీలించిన బోస్టన్ గ్రూప్
  • జిల్లాల మధ్య అనుసంధానం, పర్యాటకం, విద్య, ఆరోగ్యాన్ని పరిశీలించిన బోస్టన్ గ్రూప్
  • రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలను పరిశీలించిన బోస్టన్ గ్రూప్
  • రాష్ట్రంలో ఏయే ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సి ఉందో పరిశీలించిన బోస్టన్ గ్రూప్
  • అంతర్జాతీయంగా 54 గ్రీన్ ఫీల్డ్ నగరాలు, రాజధాని నగరాల పరిశీలనరాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి, అభివృద్ధి మార్గాల పరిశీలన
  • ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, ప్రజా సంబంధాల పరిశీలన
  • రాష్ట్రంలో 13 జిల్లాల్లో 7 జిల్లాల తలసరి ఆదాయం పెంచాల్సిన అవసరం గుర్తింపు
  • 9 జిల్లాల్లో వ్యవసాయ భూముల వినియోగం పెంచాలని సూచన
  • 60 శాతం చేపల పెంపకం 2 జిల్లాల్లోనే ఉంది, మిగతా జిల్లాల్లో పెంచాలని సూచన
  • అక్షరాస్యత శాతం, అందులోనూ మహిళా అక్షరాస్యత పెంచాలని సూచన
  • ప్రస్తుతం 0.3మిలియన్ గా ఉన్న విదేశీ పర్యాటకుల సంఖ్య పెంపునకు సూచన
  • వ్యవసాయ మార్కెట్లు, మండలాలలో జాతీయ రహదారుల అనుసంధానం జరగాలని సూచన
  • గోదావరి-పెన్నా నదుల అనుసంధానం, రాయలసీమలో కాలువల సామర్ధ్యం పెంపునకు సూచన
  • తమ పరిశీలన ఆధారంగా ప్రాంతాల వారీగా థీమ్ లను సూచించిన బోస్టన్ గ్రూప్
  • ఉత్తరాంధ్రలో అనలిటిక్స్, డేటా హబ్, వైద్య పరికరాల తయారీ యూనిట్లు, వాణిజ్య పంటలకు ప్రోత్సాహం
  • గోదావరి జిల్లాల్లో పెట్రో కెమికల్స్, ప్లాస్టిక్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సూచన
  • పోలవరం ప్రాజెక్టు పూర్తితో పాటు కోనసీమను బ్యాక్ వాటర్స్ గమ్యస్ధానంగా ఏర్పాటుకు సూచన
  • కృష్ణా డెల్టా ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్, ఫిషరీస్, మల్టీమోడల్ లాజిస్టిక్ హబ్, బందరు పోర్టుకు సూచన
  • దక్షిణాంధ్ర ప్రాంతంలో ఆటోమొబైల్ తయారీ యూనిట్లు, పేపర్, పల్ప్, ఆక్వా ఎగుమతుల ప్రోత్సాహం
  • గోదావరి-పెన్నా అనుసంధానంతో పాటు మైపాడు బీచ్‌లో పర్యాటకం అభివృద్ధి
  • పశ్చిమ రాయలసీమలో టెక్స్ టైల్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్ పరికరాలు, రహదారుల అనుసంధానం
  • తూర్పు రాయలసీమలో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ యూనిట్లు, ఉక్కు పరిశ్రమ, హైటెక్ వ్యవసాయం
  • అమరావతి ప్రాంతంలో అభివృద్ధికి కాలయాపనతో కూడిన అభివృద్ధి సాధ్యమని గుర్తింపు
  • గ్రీన్ ఫీల్డ్ నగరాల్లో బాలారిష్టాలు తప్పవన్న బోస్టన్ గ్రూపు నివేదిక, షెంజెన్, నవీ ముంబై ఉదాహరణ
  • అమరావతి వంటి చోట్ల అభివృద్ధికి ప్రతీ 10,000 మందికి వంద కోట్ల చొప్పున ఖర్చవుతుందని అంచనా
  • అమరావతి వంటి కొత్త నగరాల అభివృద్ధికి 30 నుంచి 60 ఏళ్లు పట్టవచ్చన్న నివేదిక
  • గత 50 ఏళ్లలో గ్రీన్ ఫీల్డ్ నగరాల అభివృద్ధిలో ఎన్నో సమస్యలు ఎదురైనట్లు ప్రస్తావన
  • రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతం ఒక్కటే ఏ ప్రాంతాన్నీ ఆర్ధికంగా ఊపు తీసుకురాలేదనే వాదన
  • గతంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రం ఆధారంగా రాజధాని అభివృద్ధికి లక్ష కోట్లు కావాలని నిర్ణయం
  • ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి రూ.2.25 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రస్తావన
  • ఏటా అప్పులపై వడ్డీల కోసం రూ.8 వేల నుంచి రూ.10 వేల కోట్లు ఖర్చవుతున్నట్లు ప్రస్తావన
  • పెట్టుబడితో పోలిస్తే అవకాశాల కల్పన ఎలా ఉందన్న దానిపైనా పరిశీలన
  • గతంలో మద్రాస్ ఐఐటీ, ఏపీ ప్రకృతి విపత్తుల సంస్ధ పరిశోధన ప్రకారం నదికి 5 కి.మీ పరిధిలో నిర్మాణాలు క్షేమం కాదని సూచన
  • ప్రస్తుత పరిస్ధితుల్లో అమరావతిలో ఎడ్యుకేషన్, ఫుడ్, ఫిషరీస్, హైటెక్ ఆర్గానిక్ వ్యవసాయ హబ్‌ల ఏర్పాటుకు సూచన
  • ప్రస్తుతం దేశాలు కానీ రాష్ట్రాలు కానీ బహుళ రాజధానుల ఏర్పాటుకే మొగ్గు చూపుతున్నట్లు నివేదిక
  • ప్రాంతీయ ఆకాంక్షలు నెరవెర్చేందుకు, ప్రభుత్వ శాఖలకూ, ప్రజలకూ సమన్వయం సాధ్యమవుతుందని సూచన
  • రాజధాని నిర్మాణ వ్యయం నియంత్రణతో ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయొచ్చని సూచన
  • జర్మనీ, దక్షిణ కొరియాలను ఉదాహరణగా పేర్కొన్న నివేదిక
  • కర్నూలు, అమరావతి, విశాఖ నగరాలను రాజధాని విధుల నిర్వహణకు అనువైన నగరాలుగా గుర్తింపు
  • మూడు రాజధానుల వల్ల లాభ, నష్టాలను వేర్వేరుగా ప్రస్తావించిన నివేదిక
  • ఈ నివేదికను హై పవర్ కమిటీ మరింత లోతుగా పరిశీలించి తుది నివేదిక ఇస్తుందన్న ప్రభుత్వం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :