Friday, January 3, 2020

AP captial info



Read also:

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో GN రావు కమిటీ ఇచ్చిన నివేదికతోపాటూ.బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (BCG) ఇచ్చే నివేదికను కూడా లెక్కలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడంతో.ఇవాళ BCG ఇచ్చే నివేదిక ఎలా ఉండబోతోందన్నదానిపై చర్చ జరుగుతోంది. నేటి మధ్యాహ్నం 3.30కి సీఎం జగన్‌తో BCG ప్రతినిధులు భేటీ కాబోతున్నారు. ముఖ్యమంత్రికి తమ నివేదికను ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఈ కమిటీ మధ్యంతర నివేదికను ఇచ్చింది. అందులో... గ్రీన్ ఫీల్డ్‌లో (పంటపొలాలు ఉన్న ప్రాంతంలో) కంటే... బ్రౌన్ ఫీల్డ్ (ఆల్రెడీ భవనాలు ఉన్న ప్రదేశం)లో రాజధానిని నిర్మించడం మేలని సూచించింది. ఇవాళ ఇచ్చే ఫైనల్ రిపోర్టు కూడా దాదాపు ఇలాగే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇటీవలే రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, అధికారులతో హైపవర్ కమిటీని నియమించింది. ఆ కమిటీ. GN రావు కమిటీ ఇచ్చిన రిపోర్టు, BCG రిపోర్టూ.రెండింటిపైనా సోమవారం చర్చించి.రాజధానిపై నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 20 లోగా తమ రిపోర్టును ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఆ తర్వాత ఇదే అంశంపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. ఆ తర్వాత ఫైనల్‌గా రాజధాని ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి అన్నది ప్రభుత్వం డిసైడ్ చెయ్యనుంది.

ఎక్కడిది ఈ BCG : ఇది అమెరికాకు చెందిన కన్సల్టెంట్‌ సంస్థ. 1963లో ప్రారంభమైంది. వివిధ దేశాల్లో కన్సల్టెన్సీ చేస్తోంది. ప్రస్తుతం 50కి పైగా దేశాల్లో ఉన్న శాఖల్లో.15,000 మంది దాకా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇండియాతోపాటూ చాలా దేశాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఈ సంస్థ సేవలందించింది. పోర్టులు, హైవేలు, విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు, పరిశ్రమలకు ప్లాన్స్ ఇచ్చింది. ఇండియాలో కోల్‌కతా, పారాదీప్‌, వైజాగ్‌, ఎన్నూర్‌, చెన్నై, విఒ చిదంబరం పోర్టు ట్రస్ట్‌, కాండ్ల, ముంబై, గోవా, న్యూ మంగళూరు, కొచ్చిన్‌ పోర్టుల నిర్మాణం, అభివృద్ధికి రిపోర్టులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో BCG ఇవ్వబోయే నివేదికపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :