Friday, January 3, 2020

Added 1000 medical specalities in arogya sri



Read also:

ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటించారు ఈ సందర్భంగా వంగాయగూడెంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

అనంతరం ఏలూరులో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. ''ఆరోగ్యశ్రీ అనేది దేశ ఆరోగ్య చరిత్రలోనే విప్లవం తీసుకొచ్చింది. ఇంకా మిన్నగా మరో అడుగు ముందుకు వేయడానికే ఇక్కడికి వచ్చా. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పట్టించుకోలేదు. ఇక నుంచి ఆరోగ్యశ్రీ కింద 2059 వైద్యసేవలు అందిస్తాం.
ఇంతకు ముందు 1059 వైద్యసేవలు ఉండేవి.. మరో వెయ్యి సేవలు పెంచాం. ఫిబ్రవరి 1 నుంచి క్యాన్సర్‌ రోగి రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. క్యాన్సర్‌ రోగులకు పూర్తిగా వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది.
ఆరోగ్యశ్రీకి ప్రత్యేక కార్డులు ఇస్తున్నాం. కోటి 42 లక్షల ఆరోగ్యశ్రీ కార్డులను ఇవాళ్టి నుంచే ఇస్తాం. ఆరోగ్య శ్రీ కార్డులకు క్యూఆర్‌ బార్‌ కోడ్‌ ఉటుంది. ప్రతి నెలా ఒక్కో జిల్లాలో అమలు చేసుకుంటూ వెళ్తాం. ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ అమలు చేస్తాం'' అని సీఎం తెలిపారు
Check Your Health Card Status 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :