Wednesday, January 8, 2020

About leaves



Read also:


  • ఉద్యోగులు సంబంధిత అధికారి నుండి ఎలాంటి పూర్వానుమతి లేకుండా, లేక కనీసం సెలవు దరఖాస్తు పెట్టకుండా గర్హాజర్ అయిన కాలాన్ని ఫండమెంటల్ రూల్ FR-18 ప్రకారం డైస్ నాన్(Dies-Non) గా పరిగణిస్తారు.
  • డైస్ నాన్ అంటే No work-No pay పని చేయలేదు కాబట్టి జీతం లేదు అని అర్ధం.
  • డైస్ నాన్ కాలాన్ని సర్వీస్ బ్రేక్ గా పరిగణించకూడదు.
  • కాని అట్టి డైస్ నాన్ కాలము తదుపరి వార్షిక ఇంక్రిమెంటుకు గాని, పెన్షనుకు గాని, సెలవుకు గాని పరిగణలోకి తీసుకోరు.
  • ఉద్యోగిపై CCA రూల్స్-1991 ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయి.
  • ఒక సంవత్సరం మించి విధులకు గైర్హాజరైన ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించాలని G.O.Ms.No.11 Fin తేది:13.01.2004 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
  • ఒక సంవత్సరం మించి విధులకు గైర్హాజరైన ఉద్యోగి రాజీనామా చేసినట్లు పరిగణించాలని రూలు 18 కి సవరణ ఉత్తర్వులు G.O.Ms.No.128 Fin తేది:1.6.2007 వెలువడ్డాయి.
  • పై సందర్భంలో ఉద్యోగిపై చర్యలు తీసుకునేముందు ఆ ఉద్యోగి వాదనను వినిపించుకొనుటకు తగిన అవకాశం ఇవ్వవలెను. Rule 5B & G.O.Ms.No.129 Fin తేది:1.6.2007
  • విధులకు గైర్హాజరైన ఉద్యోగి ఏ పరిస్థితుల్లో నైనా రాజీనామా చేసిన యెడల A.P.Subordinate Service రూల్స్ 1996 లోని రూలు 39 ప్రకారం. ఆమోదించవచ్చు.
  • విధులకు గైర్హాజరైన ఉద్యోగి ఏ కారణం చేతనైనా A.P.రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 లోని 43 మరియు 44 మేరకు స్వచ్చంద పదవీ విరమణ చేయదలచుకున్న నిబంధనల మేరకు అనుమతించవచ్చు.
  • విధులకు అనుమతి లేకుండా గైర్హాజరైన ఉద్యోగి తిరిగి కొంతకాలం తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన సందర్భంలో తిరస్కరించకుండా, వెంటనే విధులలో చేర్చుకోవాలి. తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.Govt.Circular.Memo.No.C.9101-4/8/FR-I/91 తేది:25.12.1991.
  • వివిధ తప్పిదాల వల్ల సర్వీసు నుండి డిస్మిస్ కాబడిన ఉద్యోగి మొత్తం సర్వీసు కోల్పోతాడు. పెన్షనరీ బెనిఫిట్స్ రావు (రూలు-24) అయితే రూలు-40 ప్రకారం కాంపెన్సెట్ అలవెన్స్,రిటైరై ఉంటే వచ్చు పెన్షన్, గ్రాట్యుటీ లో 2/3 వంతు,పెన్షన్ లేదా గ్రాట్యుటీ లేదా రెండు గానీ ప్రత్యేక పరిస్థితులలో చెల్లిస్తారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :