Saturday, January 11, 2020

Aadhar security



Read also:


మీ ఆధార్ కార్డును ఎక్కడైనా ఐడీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్ కోసం ఇస్తున్నారా? మీ దగ్గర ఆధార్ జిరాక్స్ తీసుకున్న వ్యక్తులు మీ ఆధార్ నెంబర్‌ను దుర్వినియోగం చేస్తారన్న అనుమానం ఉందా? అయితే మీ ఆధార్ నెంబర్‌ను ఎవరూ వాడుకోకుండా మీరే లాక్ చేయొచ్చు. మీకు అవసరం అయినప్పుడు అన్‌లాక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
1. ఆధార్ కార్డ్.దాదాపు అందరి దగ్గర ఉండే ఐడెంటిటీ కార్డ్. మీ ఆధార్ నెంబర్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేసే అవకాశం కల్పిస్తోంది యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. ఆధార్ నెంబర్ దుర్వినియోగం అవుతుందని, ప్రజల ప్రైవసీకి ముప్పు ఉందన్న ఆందోళన పెరగడంతో ఆధార్ సంస్థ ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 
2. మీరు ఒక్కసారి మీ ఆధార్ నెంబర్‌ను లాక్ చేస్తే ఇక ఎవరూ మీ ఆధార్ నెంబర్‌ను ఉపయోగించలేరు. ఆధార్ డెమొగ్రఫిక్, బయోమెట్రిక్, ఓటీపీ లాంటి ఆథెంటికేషన్ సేవలేవీ పనిచేయవు. మీకు కొంతకాలంపాటు ఆధార్ అవసరం లేదని అనుకుంటే ఆధార్ నెంబర్‌ను లాక్ చేయొచ్చు.
3. ఆధార్ లాక్ చేయడానికి ముందు మీరు వర్చువల్ ఐడీ జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఈ వర్చువల్ ఐడీతోనే ఆధార్ నెంబర్‌ను లాక్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్ఎంఎస్‌తో లేదా UIDAI వెబ్‌సైట్‌లో వర్చువల్ ఐడీ జెనరేట్ చేయొచ్చు. అయితే మీ మొబైల్ నెంబర్ UIDAI దగ్గర రిజిస్టరై ఉంటేనే వర్చువల్ ఐడీ జనరేట్ అవుతుంది.
4. ఎస్ఎంఎస్ ద్వారా మీరు మీ ఆధార్‌ని లాక్ చేయడానికి GETOTP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నెంబర్‌లోని చివరి 4 నెంబర్లను టైప్ చేయాలి. ఉదాహరణకు మీ ఆధార్ నెంబర్ 0123 4567 8910 అయితే GETOTP 8910 అని టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. UIDAI నుంచి మీకు 6 అంకెల ఓటీపీ ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది
5. ఆ తర్వాత LOCKUID అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్‌లో చివరి నాలుగు అంకెలు, మళ్లీ స్పేస్ ఇచ్చి 6 అంకెల ఓటీపీ ఎంటర్ చేయాలి. ఉదాహరణకు మీకు వచ్చిన ఓటీపీ 123456 అనుకుంటే LOCKUID 8910 123456 అని టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.
6. మీ ఎస్ఎంఎస్ సక్సెస్‌ఫుల్‌గా వెళ్లిన తర్వాత మీ ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది. మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఒకటి కన్నా ఎక్కువ ఆధార్ నెంబర్లకు రిజిస్టర్ చేసి ఉంటే ఆధార్ నెంబర్‌లోని చివరి 8 అంకెల్ని టైప్ చేయాల్సి ఉంటుంది.
7. ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ అన్‌లాక్ చేయడానికి GETOTP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీరు ముందే క్రియేట్ చేసిన వర్చువల్ ఐడీ నెంబర్‌లోని చివరి 6 అంకెల్ని టైప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎస్ఎంఎస్ పంపిన తర్వాత మీకు 6 అంకెల ఓటీపీ ఎస్ఎంఎస్ వస్తుంది.
8. తర్వాత UNLOCKUID అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి వర్చువల్ ఐడీలో చివరి 6 అంకెలు మళ్లీ స్పేస్ ఇచ్చి 6 అంకెల ఓటీపీ టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి. ఎస్ఎంఎస్ వెళ్లిన తర్వాత మీ ఆధార్ నెంబర్ అన్‌లాక్ అవుతుంది. మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది.
9. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఒకటి కన్నా ఎక్కువ ఆధార్ నెంబర్లకు రిజిస్టర్ చేసి ఉంటే వర్చువల్ ఐడీలోని చివరి 10 అంకెల్ని టైప్ చేయాల్సి ఉంటుంది. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :