Sunday, January 5, 2020

Aadhar link with irctc account and get benefits



Read also:

సంక్రాంతి పండుగకు రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేశారా? ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేస్తే అదనపు లాభం పొందొచ్చు. ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ ఎలా లింక్ చేయాలో లింక్ చేయడం వల్ల లాభమేంటో తెలుసుకోండి.

How to link Aadhar with IRCTC account and get benefits

1. బ్యాంకులు, పాన్ కార్డులకు మాత్రమే కాదు ఐఆర్‌సీటీసీ అకౌంట్‌తోనూ ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు.
2. సాధారణంగా ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉన్నవాళ్లెవరైనా www.irctc.co.in వెబ్‌సైట్‌తో పాటు ఐఆర్‌సీటీసీ యాప్‌లో 6 రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ బుక్ చేసుకోలేరు.
3. ఐఆర్‌సీటీసీ ద్వారా 6 కన్నా ఎక్కువ రైలు టికెట్లు బుక్ చేసుకోవాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ ఓ అవకాశం కల్పిస్తోంది. ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేస్తే 12 రైలు టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు.
4. ఐఆర్‌సీటీసీ అకౌంట్‌తో ఆధార్ లింక్ చేయడానికి ఈ ప్రాసెస్ ఫాలో అవండి. ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ www.irctc.co.in ఓపెన్ చేయండి.
5. ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. ‘My Account’ ట్యాబ్‌లో ‘Link Your Aadhaar’ పైన క్లిక్ చేయాలి.
6. మీ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీతో పాటు ఆధార్ కార్డుపైన ఉన్నట్టుగా పేరు ఎంటర్ చేయాలి.
7. ‘Send OTP’ బటన్ క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ‘Verify OTP’ పైన క్లిక్ చేయాలి.
8. చివరగా ‘Update’ పైన క్లిక్ చేస్తే ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
9. మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేస్తే ఒక నెలలో మీరు 12 రైలు టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. లేకపోతే 6 టికెట్ల వరకు మాత్రమే అనుమతి ఇస్తుంది ఐఆర్‌సీటీసీ.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :