Saturday, January 11, 2020

Single SMS to block your SBI atm card



Read also:


మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఎక్కడైనా పోగొట్టుకున్నారా? అయితే వెంటనే కార్డు బ్లాక్ చేయడం మంచిది. లేకపోతే మీ కార్డును ఎవరైనా వాడుకునే అవకాశముంది. మరి కార్డు ఎలా బ్లాక్ చేయాలో తెలుసుకోండి.

Process

1. మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? అయితే మీ కార్డు పోగొట్టుకున్నా, ఎవరైనా చోరీ చేసినా వెంటనే బ్లాక్ చేయొచ్చు. కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ కార్డును ఇతరులు దుర్వినియోగం చేసేలోపే కార్డును బ్లాక్ చేసే అవకాశముంది.
2. కార్డు పోయిందని తెలిసిన వెంటనే బ్లాక్ చేయడానికి మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సైట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఎంఎస్‌తో సులువుగా బ్లాక్ చేయొచ్చు.
3. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి BLOCKXXXX అని టైప్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. XXXX అంటే మీ కార్డు నెంబర్‌లోని చివరి నాలుగు అంకెలు.
4. మీ కార్డు బ్లాక్ అయిన వెంటనే మీకు కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో టికెట్ నెంబర్, తేదీ, బ్లాక్ చేసిన సమయం లాంటి వివరాలు ఉంటాయి.
5. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీ కార్డు బ్లాక్ చేయొచ్చు. ఇందుకోసం మీరు www.onlinesbi.com వెబ్‌సైట్ ఓపెన్ చేసి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.
6."e-Services" ట్యాబ్‌లో "Block ATM Card" క్లిక్ చేయండి. ఏ డెబిట్ కార్డు బ్లాక్ చేయాలో ఎంచుకోవచ్చు.
7. ఇక్కడే మీకు బ్లాక్ చేసిన, అన్‌బ్లాక్ చేసిన కార్డుల వివరాలు ఉంటాయి. మొదటి, చివరి నాలుగు అంకెల ద్వారా కార్డులను గుర్తించొచ్చు.
8. మీరు బ్లాక్ చేయాలనుకున్న కార్డును ఎంచుకొని సబ్మిట్‌పైన క్లిక్ చేయండి. ఆథెంటికేషన్ కోసం ప్రొఫైల్ పాస్‌వర్డ్ లేదా ఓటీపీ ఎంచుకోండి.
9. తర్వాతి స్క్రీన్‌లో ప్రొఫైల్ పాస్‌వర్డ్ లేదా ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫమ్ పైన క్లిక్ చేయండి. క్షణాల్లో మీ డెబిట్ కార్డ్ బ్లాక్ అవుతుంది. మీకు టికెట్ నెంబర్ కనిపిస్తుంది. రిఫరెన్స్ కోసం టికెట్ నెంబర్ నోట్ చేసుకోండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :