Thursday, December 26, 2019

Your aadhar usage information



Read also:

Your aadhar usage information

మనం ఇప్పటి వరకూ ఆధార్ కార్డు యొక్క సెక్యూరిటీ విషయంలో అనేక రూమర్లు మరియు వార్తలను వింటూ వచ్చాము. అంతేకాదు, ఈ ఆధార్ సెక్యురిటి అపోహలు కారణంగా, ప్రతి ఒక్కరికి తమ ఆధార్ కార్డు ఏవిధమైన దుర్వినియోగానికి వాడబడిందా? అనే అనుమానం కూడా వస్తుంది. అయితే, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీ ఆధార్ కార్డు ఏవిధమైన అవసరాలకి వాడబడిందో తెలుసుకోవడం చాలా సులభం. ఇక్కడ మేము అందించిన విధానంతో మీ ఆధార్ కార్డు వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ క్రింది విధంగా చేయాలి

1. ముందుగా ప్రభుత్వ అధికారిక UIDAI యొక్క https://resident.uidai.gov.in/check-aadhaar-status లింక్ ఓపెన్ చేయాలి.
2. పేజ్ ఓపెన్ అయిన తరువాత సూచించిన దగ్గర మీ 12 అంకెల ఆధార్ కార్డు నంబర్ నమోదు చేయాలి మరియు అక్కడ ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ కూడా నమోదు చేసి ఎంటర్ చేయాలి.
3. ఈ విధంగా చేసినతరువాత మీకు మీ యొక్క నమోదుకాబడిన (Registered) మొబైల్ నంబర్ కి OTP వస్తుంది. ఈ OTP కేవలం ముందుగా నమోదు చేయబడిన మొబైల్ నంబరుకు మాత్రమే వస్తుంది.
4. మీ మొబైల్ కి వచ్చిన OTP ఎంటర్ చేసిన తరువాత మీరు ఆధార్ పేజీ వివరాల్లోకి వెళతారు, ఇక్కడ మీరు మీకు సంబంధించిన వివరాలను చూడొచ్చు.
5. అయితే , ఇక్కడ మీరు ఏయే వివరాలు కావాలనుకుంటున్నారో వాటిని మీరు ఎంచుకోవలసి ఉంటుంది.
6. ఉదాహరణకి : డేట్ ఎంచుకోవడం ద్వారా ఈ డేట్ పరిధిలో ఏవిధమైన సౌకర్యాలకు ఈ కార్డు వాడంబడిదో తెలుస్తుంది.
7. అయితే ఇక్కడ ఎవరు వాడారన్న విషయం మాత్రం తెలుసుకునే వీలులేదు.
గమనిక : సెక్యూరిటీ కారణంగా, ఈ వెబ్సైట్ కొన్నిసార్లు ఓపెన్ కాకపోవచ్చు.
Check out Here

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :